BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.249 ప్లాన్‌.. 45 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా

BSNL: ప్రైవేట్‌ టెలికాం సంస్థలన్నీ టారిఫ్‌లను పెంచిన నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌లోని రూ.249 ప్లాన్‌ ఇప్పుడు ట్రెండవుతోంది. ఈ ప్లాన్‌ పూర్తి వివరాలేంటో చూద్దాం.

Updated : 02 Jul 2024 15:01 IST

BSNL | దిల్లీ: ప్రైవేట్‌ టెలికాం కంపెనీలన్నీ రీఛార్జ్‌ ప్లాన్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. జులై 3 నుంచి జియో, ఎయిర్‌టెల్‌.. జులై 4 నుంచి వొడాఫోన్‌ ఐడియా టారిఫ్‌లు పెరగనున్నాయి. దీంతో యూజర్లంతా తక్కువ ధరతో ఉన్న ప్లాన్ల కోసం వెతుకుతున్నారు. ఈ తరుణంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రూ.249 ప్లాన్‌కు సంబంధించిన వివరాలను ప్రభుత్వరంగ సంస్థ ఆ పోస్ట్‌లో వివరించింది. దీంతో తక్కువ ధరలో అధిక ప్రయోజనాలు ఇస్తున్న ప్లాన్‌గా దీన్ని కస్టమర్లు పేర్కొంటున్నారు. మరి ఈ ప్లాన్‌ ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) రూ.249 ప్లాన్‌ వ్యాలిడిటీ 45 రోజులు. దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌ ఉంటుంది. రోజుకు 2జీబీ చొప్పున 90జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎసెమ్మెస్‌లు లభిస్తాయి. తక్కువ ధరలో అధిక ప్రయోజనాల కోసం చూసేవారికి ఇది సరిగ్గా సరిపోతుందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. ఇతర టెలికాం కంపెనీలు ధరల్ని పెంచిన నేపథ్యంలో రీఛార్జి భారాన్ని తగ్గించుకునేందుకు  ఇది సరైన ఎంపిక అని పేర్కొంటున్నారు. అయితే, దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంకా 5జీ సేవలు ప్రారంభించలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో 4జీ సేవలు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇటీవలే 3జీ నెట్‌వర్క్‌ విస్తరణ మారుమూల గ్రామాలకు చేరింది. ఈ నేపథ్యంలో డేటా వేగం, నెట్‌వర్క్‌ అందుబాటును కూడా యూజర్లు దృష్టిలో ఉంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని