BSNL Recharge: రూ.398తో BSNLలో అపరిమిత డేటా, కాలింగ్‌!

BSNL: రూ.398 ప్లాన్‌లో డేటాతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉంటాయి.

Updated : 24 Feb 2023 12:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) తమ సబ్‌స్క్రైబర్ల కోసం ప్రత్యేక డేటా వోచర్లను అందిస్తోంది. వీటిలో అపరిమిత డేటా (Unlimited Data)తో కూడిన వోచర్‌ అందరినీ ఆకర్షిస్తోంది. ‘ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ (FUP)’ పరిమితి ముగిసిన తర్వాత కూడా వేగం తగ్గకుండానే అపరిమిత డేటా (Unlimited Data) అందిస్తుండడం విశేషం. అంటే డేటా వినియోగంపై ఎలాంటి రోజువారీ పరిమితి ఉండదు. ఈ ప్రత్యేక ఆఫర్‌ రూ.398 డేటా వోచర్‌ ప్లాన్‌ ద్వారా పొందొచ్చు.

ఈ ప్లాన్‌లో డేటాతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉంటాయి. ఇంతకు మించి ఎలాంటి ఆఫర్లు లేవు. దీనికి ఓటీటీ ప్రయోజనాలను కూడా జత చేసి ఉంటే బాగుండేదని సబ్‌స్క్రైబర్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ.. రోజూ ఎక్కువ మొత్తంలో డేటా అవసరమయ్యేవాళ్లకు ఈ ప్లాన్‌ ఉపయోగకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ప్లాన్‌ కాలపరిమితి 30 రోజులు. నెలకు రూ.398 అంటే కొంచెం ఖరీదుగానే కనిపించినప్పటికీ.. డేటా ప్రకారం చూస్తే మాత్రం సమంజసంగానే ఉందని టెలికాం నిపుణులు అంటున్నారు. రోజూ 2 జీబీ కంటే ఎక్కువ డేటా వాడని వారికి మాత్రం ఈ ప్లాన్‌తో పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాంటి వారికి అందుబాటులో ధరలో ఉండే ఇతర ప్లాన్‌లు ఉన్నాయి.

దగ్గర్లో ఉన్న ఔట్‌లెట్‌కు వెళ్లి రూ.398 ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లోనూ రీఛార్జ్‌ సదుపాయం ఉంది. జీపే, ఫోన్‌పే, పేటీఎం వంటి థర్డ్‌ పార్టీ యాప్‌ల ద్వారా కూడా చేసుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వెబ్‌సైట్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌కేర్‌ ద్వారా కూడా ఈ ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు