Budget 2023: సప్తర్షి రీతిలో మన బడ్జెట్‌.. ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్(Nirmala Sitharaman ) బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. వాటి గురించి వివరించారు. 

Updated : 01 Feb 2023 17:10 IST

దిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman ) పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అమృత్‌ కాలానికి ఇది తొలి పద్దు అని వెల్లడించారు. సప్తర్షి(సప్త రుషుల) రీతిలోనే బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. 

* సమ్మిళత వృద్ధి

చిట్టచివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరాలి

మౌలిక సదుపాయాలు- పెట్టుబడులు

* సామర్థ్యాలను వెలికితీయడం( unleashing the potential)

హరిత వృద్ధి

యువ శక్తి 

ఆర్థిక రంగం బలోపేతం

అమృత కాలంలో ప్రవేశ పెడుతున్న ఈ తొలిబడ్జెట్‌లో అన్ని వర్గాల సంక్షేమానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. తొమ్మిదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించామని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని