Published : 21 Jan 2022 16:48 IST

కోవిడ్ వేళ ఆరోగ్య బీమా పాల‌సీ కొనుగోలు చేస్తున్నారా?ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి.. 

ఆర్థిక ప్ర‌ణాళిక‌లో ఆరోగ్య బీమాకు చాలా ప్రాధాన్య‌త ఉంది. ముఖ్యంగా కోవిడ్‌-19 మూడవ వేవ్ దేశం లో విజృంభిస్తున్న వేళ.. మీతో పాటు, మీ కుటుంబ ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం ఆరోగ్య బీమా తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. అవ‌స‌ర‌మైన‌ప్పుడు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందుతాయా.. లేదా.. అనేది  మీరు ఎంపిక చేసుకున్న బీమా సంస్థ‌, కొనుగోలు చేసిన ఆరోగ్య బీమా పాల‌సీపై ఆధార‌ప‌డి ఉంటుంది. కోవిడ్‌-19 కేసులు దేశవ్యాప్తంగా రోజు ల‌క్ష‌ల్లో బ‌య‌ట‌ప‌డుతున్నాయి. కాబ‌ట్టి స‌రైన ఆరోగ్య బీమాను ఎంచుకోవ‌డం చాలా ముఖ్యం. 

మూడో ద‌శ‌లో కోవిడ్‌-19 వేగంగా వ్యాప్తిచెంద‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ సూప‌ర్ స్ప్రెడర్ గా ఉంది. ఒక‌రి నుంచి ఒక‌రికి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కుటుంబంలో ఒక‌రికి ఈ వేరియంట్ సోకిదంటే.. మిగిలిన వారికి వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కుటుంబ స‌భ్యుల‌లో ఒక‌రి కంటే ఎక్కువ మంది ఒకేసారి అనారోగ్యానికి గురైనా క‌వ‌ర్ చేసేదిగా పాల‌సీ ఉండాలి. 

కుంటుంబ స‌భ్యులు అంద‌రి కోసం ఆరోగ్య బీమా తీసుకోవాల‌నుకునేవారికి ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీ మంచి ఎంపిక‌. ఇది కుటుంబంలో చిన్న వ‌య‌సు ఉన్న వారి ద‌గ్గ‌ర నుంచి పెద్ద వారి వ‌ర‌కు అంద‌రినీ క‌వ‌ర్ చేస్తుంది. అయితే ఈ పాల‌సీలో ఒక‌రికి క‌వ‌రేజ్ చేసిన త‌ర్వాత కవర్ మొత్తం తగ్గుతుంది. ఒక‌వేశ కుటుంబంలోని మ‌రో వ్య‌క్తి అనారోగ్యం పాలైతే పాల‌సీ క‌వ‌ర్ చేయ‌క‌పోవ‌చ్చు. అందుకే పాల‌సీలో త‌గిన క‌వ‌రేజ్‌తో పాటు ఇత‌ర ప్ర‌యోజ‌నాలు ఉండేలా చూసుకోవాలి.

ప్ర‌స్తుత వైద్య ద్రవ్యోల్బణాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే, కోవిడ్ చికిత్స‌కు భారీగానే ఖ‌ర్చువుతుంది. అందువ‌ల్ల మీ కుటుంబ స‌భ్యుల వైద్య అవ‌స‌రాల‌ను అర్థం చేసుకుని కోవిడ్‌, ఇత‌ర అనారోగ్యాల కార‌ణంగా అత్య‌వ‌స‌ర వైద్య ప‌రిస్థితులకు స‌రిపోయే క‌వ‌రేజ్‌తో కూడిన ప్రణాళిక‌ల‌ను ఎంపిక చేసుకోవాలి. 

పాల‌సీ తీసుకునే ముందు బీమా సంస్థ నెట్ వ‌ర్క్ ఆసుప‌త్రుల జాబితాను చూడాలి. మీరు నివ‌సించే ప్రాంతానికి ద‌గ్గ‌ర‌లో ఉన్న ఆసుప్ర‌తులు బీమా సంస్థ జాబితాలో ఉన్న‌వి..లేనిది.. తెలుసుకోవాలి. దీని వ‌ల్ల అత్య‌వస‌ర స్థితిలో త‌క్ష‌ణ‌మే వైద్య సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయి. ఆరోగ్య బీమా విష‌యంలో నిర్లక్ష్యం అస్స‌లు ఉండ‌కూడ‌దు. పాల‌సీ కొనుగోలు, బ‌దిలీ, అప్‌గ్రేడ్ వంటివి స‌మ‌యానికి చెయ్యాలి. మీ, మీకుటుంబ అవ‌స‌రాలకు అనుగుణ‌మైన పాల‌సీ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయ‌వ‌చ్చు. ఆన్‌లైన్లో వివిధ ప్లాన్‌ల‌ను పోల్చి చూసి త‌క్కువ ప్రీమియంతో, మెరుగైన ప్ర‌యోజ‌నాల‌ను అందించే పాల‌సీ ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల మీ డ‌బ్బుతో పాటు స‌మ‌యం ఆదా అవుతుంది. 

పాల‌సీ కొనుగోలు చేసేట‌ప్పుడు ముందుగా ప్రాథ‌మిక సంప్ర‌దింపులు, రోగ నిర్థార‌ణ వంటివి క‌వ‌ర్ చేయ‌గ‌ల స‌మ‌గ్ర బీమాను కొనుగోలు చేయ‌డం మంచిది. ఇప్ప‌టికే బేసిక్ ఆరోగ్య బీమాను తీసుకున్న వారు క‌వ‌రేజ్ స‌రిపోతుంది, లేనిది నిర్థారించుకోండి. చిన్న  చిన్న గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో నివ‌సించే వారికి క‌నీసం రూ. 5 ల‌క్ష‌ల‌ నుంచి రూ. 7 ల‌క్ష‌ల క‌వ‌రేజ్‌తో కూడిన పాల‌సీ ఉండాలి. ప‌ట్ట‌ణాలు, మెట్రో న‌గ‌రాల‌లో నివసించే వారికి క‌నీసం రూ. 10 నుంచి రూ. 15 ల‌క్ష‌ల క‌వ‌రేజ్‌తో కూడిన ఆరోగ్య బీమా పాల‌సీ ఉండాలి. ఒక‌వేళ బీమా క‌వరేజ్ మొత్తాన్ని వినియోగించుకున్న‌ట్ల‌యితే, పున‌రుద్ధ‌ర‌ణ లేదా సూప‌ర్ టాప్ ప్లాను కొనుగోలు చేయవ‌చ్చు. మీ కుటుంబ వైద్య చ‌రిత్ర‌ను దృష్టిలో ఉంచుకుని ముందుగా నిర్ధార‌ణ అయిన వ్యాధుల‌తో స‌హా అన్ని వ్యాధులు క‌వ‌ర‌య్యే పాల‌సీని ఎంచుకోవ‌డం మంచిది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని