GST: వాటిపై జీఎస్టీని పెంపును వాయిదా వేయండి: కేంద్రానికి సీఏఐటీ లేఖ

టెక్స్‌టైల్‌, ఫుట్‌వేర్‌ ఉత్పత్తులపై పెంచిన జీఎస్టీని కొన్నాళ్లపాటు వాయిదా వేయాలని కాన్ఫిడరేషన్‌ ఆఫ్ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(సీఏఐటీ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. పన్ను పెంపును ఏకంగా 5శాతం నుంచి 12 శాతానికి పెంచడం అశాస్త్రీయమని, జీఎస్టీ విధానాలకు

Published : 27 Dec 2021 21:41 IST

దిల్లీ: వస్త్రాలు, పాదరక్షలపై పెంచిన జీఎస్టీని కొన్నాళ్లపాటు వాయిదా వేయాలని కాన్ఫిడరేషన్‌ ఆఫ్ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(సీఏఐటీ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. పన్ను పెంపును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడం అశాస్త్రీయమని, జీఎస్టీ విధానాలకు విరుద్ధమని లేఖలో పేర్కొంది. రెండు దశల కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న దేశీయ వ్యాపారాలపై ఇది భారంగా మారుతుందని సీఏఐటీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. వస్త్రాలపై చాలాకాలం పాటు పన్ను అనేదే లేదని గుర్తుచేశారు. వస్త్ర పరిశ్రమను మళ్లీ పన్ను పరిధిలోకి తీసుకురావడమే పరిశ్రమకు పెద్ద దెబ్బ అని చెప్పారు. 

‘‘ఈ పన్ను పెంపు వల్ల వ్యాపారులు, వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడటంతోపాటు చిన్న వ్యాపారులు కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇప్పటికే నిల్వ ఉన్న వస్త్రాలను ఎంఆర్‌పీ ధరలకు అమ్మితే.. మిగతా ఏడు శాతం పన్ను భారం వ్యాపారులపైనే పడుతుంది. దీని వల్ల పన్ను ఎగవేతలు, మోసాలు జరిగే అవకాశముంది. అందుకే జీఎస్టీ పెంపును వాయిదా వేయాలని కోరుతున్నాం’’అని కేంద్రమంత్రికి రాసిన లేఖలో పేర్కొంది. ఇప్పటికే భారత్‌ వస్త్ర రంగంలో ఇతర దేశాలతో పోటీ పడలేకపోతుందని, ఇప్పుడు ఈ పన్ను పెంపు దేశీయ వస్త్ర వ్యాపారానికి అడ్డంకిగా మారడమే కాకుండా ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని కేంద్రమంత్రికి సీఏఐటీ వివరించింది. 

జీఎస్టీ పెంపు వాయిదాతోపాటు.. ఆదాయపన్ను రిటర్న్స్‌ దాఖలు చేసే గడువును కూడా పొడిగించాలని సీఏఐటీ కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఐటీ రిటర్న్స్‌ దాఖలుకు చివరి తేదీ డిసెంబర్‌ 31గా ఉంది. అయితే, కొత్త ఐటీ పోర్టల్‌లో ఫైలింగ్‌ సమయంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, దీంతో చాలా మంది ఐటీ రిటర్న్స్‌ ఫైలింగ్‌ చేయలేకపోతునందున గడువును పొడిగించాలని కోరింది.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని