Campus Activewear: క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ ఐపీఓ.. ఒక్కోలాట్‌పై ₹3,468 లిస్టింగ్‌ గెయిన్స్‌

క్యాంపస్‌ బ్రాండ్‌ పేరిట పాదరక్షలు విక్రయించే కంపెనీ క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ షేర్లు ఈరోజు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి...

Published : 09 May 2022 14:22 IST

దిల్లీ: క్యాంపస్‌ బ్రాండ్‌ పేరిట పాదరక్షలు విక్రయించే కంపెనీ క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ షేర్లు ఈరోజు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. మార్కెట్లు భారీ పతనంలో ఉన్నప్పటికీ.. ఈ కంపెనీల షేర్లకు శుభారంభం లభించడం విశేషం. ఇష్యూ దర రూ.292తో పోలిస్తే షేర్లు 23 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి.

క్యాంపస్‌ షేర్లు 21.57 శాతం ప్రీమియంతో రూ.355 వద్ద బీఎస్‌ఈలో, 23.28 శాతం ప్రీమియంతో రూ.360 వద్ద ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యాయి. ఈ లెక్కన ఒక లాట్‌ (51 షేర్లు)కు రూ.14,892తో బిడ్‌ దాఖలు చేసిన వారు రూ.3,468 లిస్టింగ్ గెయిన్స్‌ను ఆర్జించారు. పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈ నెల 26న ప్రారంభమై 28న ముగిసింది. కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.1400 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. షేరుకు ధరల శ్రేణిగా రూ.278- 292ను నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని