Q-A: నా జీతానికి ఇంటి రుణం వస్తుందా? వడ్డీ ఎంతుంటుంది?
మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా టర్మ్ పాలసీని తీసుకోండి
నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నెలవారీ జీతం రూ. 12 వేలు. సిటీకి దగ్గరలో ఇల్లు కొనాలనుకుంటున్నాను. ఇంటి రుణం పొందొచ్చా? ఎంత వరకు వస్తుంది?
- గోపీ మందడపు
మీరు ఇంటి రుణం పొందొచ్చు. దీని కోసం మీరు ఎస్‌బీఐ లేదా ఏదైనా దగ్గరలో ఉన్న బ్యాంకును సంప్రదించవచ్చు. సాధారణంగా బ్యాంకు మీ ఉద్యోగ సంస్థ అందించిన పేస్లిప్స్, 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్, ఆదాయ పన్ను రిటర్నులు (అవసరం పడితే) లాంటివి అడగవచ్చు. మీ నెలవారీ జీతాన్ని బట్టి రూ. 5-6 లక్షల వరకు రుణం పొందే వీలుంటుంది. ఇది బ్యాంకును బట్టి మారవచ్చు. వడ్డీ రేటు సుమారుగా 8-8.50 శాతం ఉండే అవకాశం ఉంటుంది.
నా వయసు 29. నా నెలవారీ జీతం రూ. 65 వేలు. ఖర్చులు రూ. 25 వేలు. పొదుపు, బీమా కోసం సలహాలు ఇవ్వండి. నేను పెట్టుబడులు చేయదల్చుకోలేదు.
- శివ
ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్లు వచ్చే వరకు పాలసీ కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా భవిష్యత్‌లో క్లెయిమ్ చేయాల్సివస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ ఆన్‌లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్‌సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. మీరు మీ ఆర్థిక లక్ష్యాల ప్రకారం పొదుపు చేయడం మంచిది. పొదుపు చేసిన మొత్తాన్ని బ్యాంకుల్లో ఉంచడం వల్ల ద్రవ్యోల్బణం కంటే తక్కువ రాబడి వస్తుంది. మీకు సురక్షితమైన పెట్టుబడి కావాలనుకుంటే బ్యాంకు డిపాజిట్ లేదా పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ ఖాతా ఎంచుకోవచ్చు. పదవీ విరమణ కోసం ఎన్‌పీఎస్ ఖాతా ఎంచుకోవచ్చు.
2 సంవత్సరాలకు ఓ లక్ష రూపాయలు పెట్టుబడి పెడుదామనుకుంటున్నాను. నష్టం భరించలేను. మంచి రాబడి మార్గం సూచించండి.
- కృష్ణ కిరీటి
మీరు సురక్షితమైన పెట్టుబడి మార్గం కోసం వెతుకుతున్నారు కాబట్టి బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎంచుకోవడం మేలు. ఇందులో మీకు రూ. 5 లక్షల వరకు బీమా హామీ ఉంటుంది. 1-2 ఏళ్ల డిపాజిట్‌పై 6 నుంచి 7 శాతం వరకు కూడా వడ్డీ పొందొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
CM KCR: కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్
-
India News
Go First Airways: 55 మందిని వదిలేసిన గో ఫస్ట్ ఎయిర్వేస్కు భారీ జరిమానా
-
Movies News
Rakesh - Sujatha: ‘జబర్దస్త్’గా రాకింగ్ రాకేశ్- సుజాత నిశ్చితార్థం.. తారల సందడి
-
General News
Telangana News: మంత్రి పువ్వాడ అజయ్‌కు కోర్టు ధిక్కరణ కేసులో నోటీసు
-
General News
Telangana News: ఆ విద్యార్థులకు సువర్ణావకాశం.. TTWR COE సెట్‌కు నేటి నుంచే దరఖాస్తులు!
-
World News
Google: ఇంటర్వ్యూ చేస్తుండగా.. హెచ్ఆర్కి లేఆఫ్..!