వర్షం కారణంగా ఇంజిన్ పాడైతే బీమా వర్తిస్తుందా?
ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ కవర్‌ను కొనుగోలు చేయవచ్చు
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కారు ఇంజిన్ దెబ్బతిన్న కారణంతో పెద్దఎత్తున క్లెయిమ్‌లు బీమా కంపెనీలకు వస్తుంటాయి. వర్షాకాలంలో చాలా క్లెయిమ్‌లు ప్రకృతి విపత్తుల వల్ల జరిగే నష్టాలవే అయ్యి ఉంటాయి. సాధారణంగా నీరు లేదా హైడ్రోస్టాటిక్ లాక్ కారణంగా ఇంజిన్ దెబ్బతింటుంది. అయితే, కారు యజమానుల నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి నష్టాలు సంభవిస్తున్నాయనే కారణం చెప్పి బీమా సంస్థలు ఈ క్లెయిమ్‌లను తిరస్కరిస్తుంటాయి.
నీటి వల్ల ఇంజిన్ దెబ్బతినడం సాధారణంగా రెండు సందర్భాల్లో జరుగుతుంది.
1. కారు నీటిలో మునిగిపోయినప్పుడు లేదా నీరు తగ్గిన తర్వాత యజమాని దాన్ని తీయడానికి ప్రయత్నించినప్పుడు ఇంజిన్‌లో నీరు చేరిన కారణంగా అది పనిచేయదు.
2. వరదలున్న ప్రాంతం నుంచి కారు వెళ్లడంతో ఇంజిన్లోకి నీరు ప్రవేశించి దానికి నష్టం కలుగుతుంది.
క్లెయిమ్ తిరస్కరించకూడదంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీ కారు నీటిలో మునిగిపోతే మొదట బీమా కంపెనీకి పరిస్థితి వివరించండి. ఎందుకంటే మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నారని సంస్థకు తెలియజేయడం ముఖ్యం. వాహనాన్ని పరిశీలించడం కోసం సమీప గ్యారేజీకి తీసుకెళ్లాలని బీమా సంస్థ సూచించొచ్చు. అప్పుడు కూడా ఇంజిన్ పనిచేయపోతే.. అది కారు యజమాని నిర్లక్ష్యంగా కాకుండా ప్రమాదంగా పరిగణిస్తారు.
నీటితో నిండిన ప్రాంతం గుండా డ్రైవింగ్ చేసినప్పుడు ఇంజిన్ దెబ్బతింటే డ్రైవర్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారో లేదో తెలుసుకునే మార్గం లేనందున బీమా సంస్థ దాన్ని తిరస్కరిస్తుంది. అటువంటి సందర్భంలో కారు వరదలు ఉన్న ప్రదేశంలో ఆగిపోతే దాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించడకుండా అక్కడే వదిలేసి రావడం. ఒకసారి నీటి మట్టం తగ్గిన తర్వాత, బీమా సంస్థకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించి, ఏం చేయాలో అడగండి.
ఇటువంటి సమస్యలను ఎదుర్కోకుండా మీరు ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ కవర్‌ను కొనుగోలు చేయవచ్చు. యాడ్-ఆన్ ఇంజన్‌కు అన్ని రకాల నష్టాలపై కవరేజ్ ఇస్తుంది. దీని ధర కూడా ఎక్కువగా ఏమీ ఉండదు. అయితే, ఒకసారి బీమా పాలసీని జారీ చేసిన తర్వాత మీరు దాన్ని కొనుగోలు చేయలేరు. పునరుద్ధరణ వరకు వేచి ఉండాలి.
నీరు క్యాబిన్లోకి ప్రవేశించి, స్పీకర్లు, సెన్సార్లు లేదా ఎలక్ట్రిక్ పరికరాలు వంటి భాగాలను దెబ్బతీస్తే, బీమా సంస్థ ఫ్యాక్టరీతో అమర్చిన భాగాలకు మాత్రమే చెల్లిస్తుంది. అటువంటి అమరికలను కవర్ చేసే యాడ్-ఆన్ లేకపోతే మీరు విడిగా కొనుగోలు చేసినవాటికి కవరేజ్ ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్‌జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్