సిప్‌ని తాత్కాలికంగా ఆపే వీలుందా?

అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో అంటే డ‌బ్బు స‌ర్దుబాటు కాన‌ప్పుడు సిప్ వాయిదా చెల్లించ‌క‌పోయినా తిరిగి ప్రారంభించ‌వ‌చ్చు​​​​​​...

Published : 18 Dec 2020 13:48 IST

అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో అంటే డ‌బ్బు స‌ర్దుబాటు కాన‌ప్పుడు సిప్ వాయిదా చెల్లించ‌క‌పోయినా తిరిగి ప్రారంభించ‌వ‌చ్చు

క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల్లో (సిప్‌) క్ర‌మం త‌ప్ప‌కుండా పెట్టుబ‌డులు స‌మ‌యానికి చేయాల్సిందే అన్న విష‌యం తెలిసిందే. అయితే ఏదైనా పండ‌గ‌ల స‌మయంలో డ‌బ్బు వినియోగం పెరిగింది లేదా ఖ‌ర్చు ఎక్కువ‌గా ఉంద‌నుకున్న‌ప్పుడు, డ‌బ్బు స‌ర్దుబాటు కాలేన‌ప్పుడు సిప్‌ను తాత్కాలికంగా నిలిపివేసే అవ‌కాశం ఉంద‌న్న సంగ‌తి మీకు తెలుసా. అవును, కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ఆరు వాయిదాల వ‌రకు సిప్ తాత్కాలికంగా ఆపేసి త‌ర్వాత ప్రారంభించుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తాయి. అయితే అది మీరు ఎంచుకునే మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ను బ‌ట్టి ఉంటుంది.

సిప్ నిలిపివేసే విధానం:

అన్ని మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు సిప్‌ను తాత్కాలికంగా నిలిపివేసేందుకు అవ‌కాశం ఇవ్వ‌వు. ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, ఇన్వెస్కో ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌, రిల‌య‌న్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ వంటి సంస్థలు ఈ స‌దుపాయం క‌ల్పిస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ జీవిత కాలంలో ఇలా ఒకేసారి సిప్‌ను తాత్కాలికంగా నిలిపివేసే అవ‌కాశం ఇస్తుంది. వేర్వేరు ఫండ్‌ సంస్థ‌లు దీనికోసం విభిన్న పరిమితుల‌ను క‌లిగి ఉంటాయి.

సిప్‌ను ఆపివేసందుకు ఫండ్ సంస్థ‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకోవ‌డం లేదా ఫారం పూర్తి చేయ‌డంతో కొంత‌కాలం నిలిపివేయ‌వ‌చ్చు. కానీ దీనికోసం ఒక నెల‌రోజులో ముందే స‌మాచారం సంస్థ‌ల‌కు అందించ‌వ‌ల‌సి ఉంటుంది, లేదంటే మీ అభ్య‌ర్థ‌న తిర‌స్క‌ర‌ణ‌కు గురయ్యే అవ‌కాశం ఉంటుంది. ఎప్పుడైతే సిప్ నిలిపివేసేందుకు సంస్థ అంగీక‌రిస్తుండో అప్పుడు మీ ఖాతాలోనుంచి డ‌బ్బు డెబిట్ కాకుండా ఉంటుంది. మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే కొన్ని ఫండ్ సంస్థ‌లు టాప్ అప్ లేదా స్టెప్ అప్ స‌దుపాయాన్ని క‌ల్పిస్తాయి. దీంతో మీరు ప్ర‌తి ఏడాదికోసారి సిప్ వాయిదాను పెంచుకోవ‌చ్చు.

మీరు సిప్‌ను ఆపుతున్నారా?

సిప్‌ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు ఒక ఫారం లేదా ఒక లెట‌ర్‌ను మీ మ్యాచువ‌ల్ ఫండ్ సంస్థ‌కు సమ‌ర్పించాలి. లేదా మీ సిప్‌కి స‌రిపోయేంత న‌గ‌దు మీ ఖాతాలో లేక‌పోతే కంపెనీ ఆటోమేటిక్‌గా 5 నెల‌ల వ‌ర‌కు సిప్ తీసుకోవ‌డం నిలిపివేస్తుంది. అందుకే మీ సిప్ అనుకోకుండా నిలిచిపోకుండా ఉండాలంటే క‌చ్చితంగా మీ ఖాతాలో డ‌బ్బు ఉండాలి. అయితే వీలైనంత వ‌ర‌కు సిప్‌ని ఆప‌క‌పోవ‌డ‌మే మంచిది. ఏదైనా అవ‌స‌రాల కోసం అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోవాలిని నిపుణులు ఎప్పుడూ చెప్తుంటారు. దీంతో అనుకోకుండా ఎలాంటి ఖ‌ర్చులు ల‌వ‌చ్చినా పిప్ నిలిపివేయాల్సినా అవ‌స‌రం ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని