Canara bank: వడ్డీ రేట్లు సవరించిన కెనరా బ్యాంక్‌

కెనరా బ్యాంకు తన రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు(RLLR), మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు(MCLR)లను పెంచింది.

Published : 11 Mar 2023 16:28 IST

దిల్లీ: కెనరా బ్యాంకు తన రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (RLLR), మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు (MCLR)ను సవరించింది. BSE ఫైలింగ్‌ ప్రకారం కొత్త వడ్డీ రేట్లు 2023 మార్చి12 నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఓవర్‌నైట్‌ MCLRను 7.55% నుంచి 7.90% (35 బేసిస్‌ పాయింట్లు)కు పెంచింది. ఒక సంవత్సరం MCLRను 8.50% నుంచి 8.60%కు పెంచింది. కెనరా బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం అన్ని రిటైల్‌ లెండింగ్‌ పథకాల వడ్డీ రేట్లు రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేట్‌ (RLLR) 9.25%కు లింక్‌ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని