కెనరా బ్యాంక్‌ సోషల్‌ మీడియా ఖాతా హ్యాక్‌!

Canara Bank: కెనరా బ్యాంక్‌ ‘ఎక్స్‌’ హ్యాండిల్‌ హ్యాక్‌ అయింది. దీంతో ఒక్కసారిగా బ్యాంక్‌ అధికారులు, యూజర్లు కంగుతిన్నారు.

Published : 23 Jun 2024 16:44 IST

Canara Bank | ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస సోషల్‌మీడియా ఖాతాల హ్యాక్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవలె యాక్సిస్‌ బ్యాంక్‌ అధికారిక ‘ఎక్స్‌’ అకౌంట్‌ హ్యాక్‌ మరువకముందే మరో బ్యాంక్‌ ఖాతాపై సైబర్‌ దాడి జరిగింది. తాజాగా కెనరా బ్యాంక్‌ (Canara Bank) సోషల్‌ మీడియా ఖాతా హ్యాక్‌ అయింది. అధికారిక అకౌంట్‌ జులై22న హ్యాక్‌కు గురైంది. ఒక్క సారిగా హ్యాండిల్‌ యూజర్‌నేమ్‌ మారిపోవడంతో వినియోగదారులు, అధికారులు అందోళనకు గురయ్యారు. అయితే దీనిపై బ్యాంక్‌ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

అదానీ వేతనం రూ.9.26 కోట్లు.. సొంత ఉద్యోగుల కంటే తక్కువట!

కొద్ది రోజుల క్రితమే యాక్సిస్‌ బ్యాంక్‌పై కూడా ఇలాంటి సైబర్‌ దాడి జరిగింది. సంబంధిత ఎక్స్‌ హ్యాండిల్‌లో క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమవ్వడంతో అకౌంట్‌ హ్యాక్‌ అయిందని అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన బ్యాంక్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు