ఆకర్షణీయమైన వడ్డీతో కెనరా బ్యాంక్‌ నుంచి ప్రత్యేక FD

ఈ ప్ర‌త్యేక డిపాజిట్ ప‌థ‌కం కింద సీనియ‌ర్ సిటిజ‌న్లకు 7.50% వ‌డ్డీ ల‌భిస్తుంది.

Updated : 07 Oct 2022 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్‌ 666 రోజులకు ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ప్రారంభించింది. ఈ పథకం కింద డిపాజిట్‌ చేసిన సాధారణ ప్రజలకు 7%, సీనియర్‌ సిటిజన్లకు 7.50% వడ్డీ లభిస్తుంది. రూ.2 కోట్ల లోపు డిపాజిటర్లకు ఈ ప్రత్యేక టర్మ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది. కెనరా బ్యాంకు 7 రోజుల నుంచి మొదలుకుని 10 సంవత్సరాల వరకు వివిధ కాలవ్యవధులతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అందిస్తోంది. 

రుణ రేట్లూ పెరిగాయి..

మరోవైపు కెనరా బ్యాంకు రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌), మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)లను పెంచింది. సవరించిన రేట్లు నేటి అక్టోబరు 7 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం.. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 50 బేసిస్‌ పాయింట్లు పెరిగి 8.30% నుంచి 8.80%కు చేరింది.

ఎంసీఎల్‌ఆర్‌, అన్ని కాలపరిమితులకూ 15 బేసిస్‌ పాయింట్లు పెంచారు. దీంతో ఓవర్‌నైట్‌, ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ 6.90% నుంచి 7.05%కు, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 7.25% నుంచి 7.40%కు, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 7.65% నుంచి 7.80%కు, ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 7.75% నుంచి 7.90%కు చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని