కారు రుణంపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు..

సాధారణంగా బ్యాంకులు కారు రుణాలను మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితితో అందిస్తాయి

Published : 05 Apr 2021 14:04 IST

కొత్త కారును కొనుగోలు చేయాలన్నా లేదా పాత కారును అప్‌గ్రేడ్ చేయాలనుకున్నా లేదా కుటుంబానికి మరొక కారు కొనుగోలు చేయాలనుకున్నా కారణం ఏమైనప్పటికీ, రుణం తీసుకుని కారును సుల‌భంగా కొనుగోలు చేయ‌వ‌చ్చు. సాధారణంగా బ్యాంకులు కారు రుణాలను మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితితో అందిస్తాయి, కానీ కొన్ని బ్యాంకులు మాత్రం ఏడు సంవత్సరాల కాలపరిమిత‌తో రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. ఎక్కువ కాలపరిమితితో రుణం తీసుకుంటే, నెల‌వారీగా చెల్లించాల్సిన ఈఎమ్ఐ మొత్తం త‌క్కువ‌గా ఉంటుంది. ఇది కారు కొనుగోలును మరింత సులభతరం చేస్తుంది, కానీ ఎక్కువ మొత్తంలో వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, కారు తరుగుదల ఆస్తి, కాబ‌ట్టి ఇందు కోసం పెద్ద మొత్తంలో రుణం తీసుకోవడం తెలివైన నిర్ణ‌యం కాకపోవచ్చు. ఒకవేళ మీరు స్వల్ప కాలపరిమితితో రుణం తీసుకున్నట్లైతే, పెద్ద మొత్తంలో ఈఎంఐని చెల్లించాల్సి ఉంటుంది.  సరైన సమయానికి ఈఎమ్ఐ చెల్లించ లేక‌పోతే, అది మీ క్రెడిట్ రిపోర్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే రుణ మొత్తానికి కూడా షరతులు వర్తిస్తాయి. ఉదాహరణకు, కొన్ని బ్యాంకులు కారు పూర్తి ఎక్స్-షోరూమ్ ధరపై రుణాలను ఇస్తే, మరికొన్ని బ్యాంకులు కారు మొత్తం ధ‌ర‌లో 80 శాతం వరకు మాత్రమే రుణం ఇస్తున్నాయి. కారు రుణం తీసుకునేప్పుడు బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్న‌ వ‌డ్డీ రేటు మాత్రమే కాకుండా, దానికి వర్తించే ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలను కూడా పరిశీలించడం మంచిది.


కారు రుణంపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల వివరాలను కింద చూద్దాం…

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని