Union Budget 2022: ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు: నిర్మలా సీతారామన్‌

రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

Updated : 01 Feb 2022 12:35 IST

దిల్లీ: రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. దీని ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్‌ సమావేశం సందర్భంగా నిర్మలా సీతారామన్‌ ప్రసంగిస్తూ.. దేశ వ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి పథకం రూపొందించినట్లు చెప్పారు. 2022- 2023 మొత్తం బడ్జెట్‌ అంచానాలు రూ.39.45లక్షల కోట్లుగా వివరించారు. ద్రవ్యలోటు 6.9శాతం ఉంటుందని.. 2025- 26నాటికి దాన్ని 4.5శాతానికి తగ్గించడమే లక్ష్యమని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని