హోంశాఖకు రూ.1.66లక్షల కోట్లు..

కేంద్ర బడ్జెట్‌-2021లో హోంమంత్రిత్వ శాఖకు  రూ.1.66లక్షల కోట్లు కేటాయించారు. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించారు. హోంశాఖకు కేటాయించిన నిధుల్లో అధిక మొత్తం..

Published : 01 Feb 2021 17:06 IST

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌-2021లో హోంమంత్రిత్వ శాఖకు  రూ.1.66లక్షల కోట్లు కేటాయించారు. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించారు. హోంశాఖకు కేటాయించిన నిధుల్లో అధిక మొత్తం.. దాదాపు రూ.1.03లక్షల కోట్లు పోలీసు బలగాలకే(సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌) వెళ్లనున్నాయి. అత్యధికంగా కొత్తగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్‌కు రూ.30వేల కోట్లు, లద్ధాఖ్‌కు రూ.5వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా కారణంగా గతేడాది జనాభా లెక్కలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కాబట్టి జనాభా లెక్కల కార్యక్రమం కోసం రూ.3,768కోట్లు ప్రకటించారు. అంతేకాకుండా హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నిర్వహించే కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం రూ.1,641 కోట్లు, విపత్తు నిర్వహణల కోసం రూ.481 కోట్లు కేటాయించారు. 

దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి కేంద్ర బడ్జెట్‌లో రూ.835కోట్లు కేటాయించారు. 2020-21 బడ్జెట్‌లో ఈ దర్యాప్తు సంస్థకు రూ.802 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్‌లో దాన్ని రూ.835 కోట్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా 2019-20 బడ్జెట్‌లో సీబీఐకి రూ.768.08కోట్లు కేటాయించడం గమనార్హం. 

ఇదీ చదవండి

ఆదాయపన్ను చెల్లింపుదారులకు దక్కని ఊరట
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని