Monetisation: ‘మానిటైజేషన్‌కు ఆస్తులు వెతకండి’.. మంత్రులకు కేంద్రం సూచన!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి గానూ నగదీకరించడానికి తమ పరిధిలో ఏమేం ఆస్తులు ఉన్నాయో చూడాలని కేంద్రం ఆయా మంత్రిత్వ శాఖలకు సూచించినట్లు తెలిసింది.
దిల్లీ: తమ పరిధిలో ఆస్తుల నుంచి ఆదాయమార్గాలేమైనా (మానిటైజ్) ఉన్నాయో చూడాలని కేంద్రం ఆయా మంత్రిత్వ శాఖలకు సూచించినట్లు తెలిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాది మానిటైజేషన్ లక్ష్యాలకు దూరంగా నిలిచే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం ఈ సూచనలు చేసినట్లు తెలిసింది.
ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (NMP) కింద ఇప్పటి వరకు రూ.33,422 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం మానిటైజ్ చేసింది. ఇందులో బొగ్గు శాఖ రూ.17,000 కోట్లతో ముందు వరుసలో నిలిచింది. అయితే, కొన్ని మంత్రిత్వ శాఖలు అనుకున్న లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమైయ్యాయి. ఈ క్రమంలో మానిటైజ్ చేయడానికి అవకాశం ఉన్న అదనపు ఆస్తులు లేదా ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషించాలని కేంద్రం ఆయా మంత్రిత్వ శాఖలకు సూచించినట్లు ఎకమిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
2022-23 రూ.1,62,422 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా.. 7 నెలల్లో రూ.33 వేల కోట్లు మాత్రమే వీలు పడింది. గతేడాది (2021-22) ప్రభుత్వం మొత్తం రూ.88,000 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకోగా రూ.1 లక్ష కోట్ల లావాదేవీలతో దానిని అధిగమించింది. ఇపుడు 2022-23 లక్ష్యమైన రూ.1,62,422 కోట్లను సాధించడంలో రూ.38,243 కోట్ల మేర వెనకబడవచ్చని ప్రభుత్వ తాజా అంచనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయా శాఖలను ప్రక్రియను వేగిరం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. రైల్వే, టెలికాం శాఖలు మాత్రం మానిటైజేషన్ ప్రక్రియను వచ్చే ఏడాది వరకు వాయిదా వేయాలని భావిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్‌పై డిస్కౌంట్.. ఈ సబ్‌స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్‌ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్‌బాక్స్‌ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్‌ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్‌బాక్స్‌లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్‌ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్‌ను మనదేశంలో తొలిసారిగా మెడ్‌ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్‌షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్‌షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్‌ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్‌ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్‌పై డిస్కౌంట్.. ఈ సబ్‌స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్‌పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..