Monetisation: ‘మానిటైజేషన్‌కు ఆస్తులు వెతకండి’.. మంత్రులకు కేంద్రం సూచన!

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి గానూ నగదీకరించడానికి తమ పరిధిలో ఏమేం ఆస్తులు ఉన్నాయో చూడాలని కేంద్రం ఆయా మంత్రిత్వ శాఖలకు సూచించినట్లు తెలిసింది.

Published : 24 Nov 2022 14:48 IST

దిల్లీ: తమ పరిధిలో ఆస్తుల నుంచి ఆదాయమార్గాలేమైనా (మానిటైజ్‌) ఉన్నాయో చూడాలని కేంద్రం ఆయా మంత్రిత్వ శాఖలకు సూచించినట్లు తెలిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాది మానిటైజేషన్‌ లక్ష్యాలకు దూరంగా నిలిచే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం ఈ సూచనలు చేసినట్లు తెలిసింది.

ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (NMP) కింద ఇప్పటి వరకు రూ.33,422 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం మానిటైజ్‌ చేసింది. ఇందులో బొగ్గు శాఖ రూ.17,000 కోట్లతో ముందు వరుసలో నిలిచింది. అయితే, కొన్ని మంత్రిత్వ శాఖలు అనుకున్న లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమైయ్యాయి. ఈ క్రమంలో మానిటైజ్‌ చేయడానికి అవకాశం ఉన్న అదనపు ఆస్తులు లేదా ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషించాలని కేంద్రం ఆయా మంత్రిత్వ శాఖలకు సూచించినట్లు ఎకమిక్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది.

2022-23 రూ.1,62,422 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా.. 7 నెలల్లో రూ.33 వేల కోట్లు మాత్రమే వీలు పడింది. గతేడాది (2021-22) ప్రభుత్వం మొత్తం రూ.88,000 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకోగా రూ.1 లక్ష కోట్ల లావాదేవీలతో దానిని అధిగమించింది. ఇపుడు 2022-23 లక్ష్యమైన రూ.1,62,422 కోట్లను సాధించడంలో రూ.38,243 కోట్ల మేర వెనకబడవచ్చని ప్రభుత్వ తాజా అంచనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయా శాఖలను ప్రక్రియను వేగిరం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. రైల్వే, టెలికాం శాఖలు మాత్రం మానిటైజేషన్‌ ప్రక్రియను వచ్చే ఏడాది వరకు వాయిదా వేయాలని భావిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని