Cryptocurrency: మనీలాండరింగ్‌ చట్టం పరిధిలోకి క్రిప్టో బిజినెస్‌!

Cryptocurrency: క్రిప్టో ట్రేడింగ్‌, సేఫ్‌కీపింగ్‌ సహా ఇతర సంబంధిత ఆర్థిక సేవలన్నీ యాంటీ మనీలాండరింగ్‌ చట్టం పరిధిలోకి రానున్నాయి.

Published : 08 Mar 2023 23:53 IST

దిల్లీ: క్రిప్టోకరెన్సీ (Cryptocurrency) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిపో లావాదేవీలు, బదిలీ సహా ఇతర వ్యవహారాలను ‘అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం’  (anti-money laundering act) పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో డిజిటల్‌ ఆస్తులపై నిఘా మరింత పెరగనుంది. ఈ మేరకు మంగళవారమే ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

దీంతో క్రిప్టో ట్రేడింగ్‌, సేఫ్‌కీపింగ్‌ సహా ఇతర సంబంధిత ఆర్థిక సేవలన్నీ యాంటీ మనీలాండరింగ్‌ చట్టం పరిధిలోకి రానున్నాయి. బ్యాంకులు, స్టాక్‌ బ్రోకర్ల తరహాలోనే డిజిటల్‌ ఆస్తుల వేదికలకు సైతం మనీలాండరింగ్‌ నిబంధనలు వర్తింపజేయాలని ప్రపంచ దేశాల నుంచి వినిపిస్తోన్న వాదన. అందుకనుగుణంగానే భారత ప్రభుత్వం తాజాగా ఆ దిశగా నిర్ణయం తీసుకుంది.

2022 ఏప్రిల్‌ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ వంటి వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులకు సంబంధించిన లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయాల మీద 30 శాతం పన్ను విధిస్తోంది. అలాగే ఒక పరిమితికి మించిన వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల బదిలీపై 1 శాతం టీడీఎస్‌ (మూలంలో పన్ను కోత) వసూలు చేస్తోంది. దీంతో దేశీయంగా క్రిప్టో లావాదేవీలు గణనీయంగా తగ్గాయి. క్రిపోలపై కచ్చితంగా నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గతంలో ప్రకటించారు. అయితే, దానికి అంతర్జాతీయ సహకారం, సమన్వయం చాలా అవసరమని.. అప్పుడే ఆ దిశగా తీసుకునే చర్యలు సత్ఫలితాలిస్తాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని