ISI mark: వంట పాత్రలకూ ఐఎస్‌ఐ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

వంటకు ఉపయోగించే అల్యూమినియం, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రలకూ ఇక నుంచి ఐఎస్‌ఐ (ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌) ముద్రను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

Updated : 06 Jul 2024 02:32 IST

దిల్లీ: వంటకు ఉపయోగించే అల్యూమినియం, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రలకూ ఇక నుంచి ఐఎస్‌ఐ (ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌) ముద్రను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జాతీయ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలను పాటించేందుకు ఇది తోడ్పడుతుందని భావిస్తోంది. ఈ విషయాన్ని శుక్రవారం బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) తెలిపింది. వినియోగదారుల భద్రత రీత్యా ఉత్పత్తుల నాణ్యత పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. వంట పాత్రలపై ఐఎస్‌ఐ మార్కు ఉండాలని డీపీఐఐటీ (డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌) ఈ ఏడాది మార్చిలో ఆదేశాలను ఇచ్చింది. ఐఎస్‌ఐ ముద్ర లేని పాత్రల ఉత్పత్తి, దిగుమతి, విక్రయం, పంపిణీ, నిల్వ, ప్రదర్శనలు చేయొద్దని బీఐఎస్‌ ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని