Empoyment: ఉద్యోగ కల్పనపై సిటీ గ్రూప్‌ నివేదిక వాస్తవ విరుద్ధం

భారత్‌ 7 శాతం వృద్ధి రేటును సాధిస్తున్నా కూడా, సంతృప్తికర స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కష్టపడాల్సిందేనంటూ, అమెరికా కేంద్రంగా పనిచేసే ఆర్థిక సేవల సంస్థ సిటీ గ్రూప్‌ ఇటీవల విడుదల చేసిన నివేదికను కార్మిక మంత్రిత్వ శాఖ సోమవారం తోసిపుచ్చింది.

Updated : 09 Jul 2024 03:19 IST

కార్మిక మంత్రిత్వ శాఖ

దిల్లీ: భారత్‌ 7 శాతం వృద్ధి రేటును సాధిస్తున్నా కూడా, సంతృప్తికర స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కష్టపడాల్సిందేనంటూ, అమెరికా కేంద్రంగా పనిచేసే ఆర్థిక సేవల సంస్థ సిటీ గ్రూప్‌ ఇటీవల విడుదల చేసిన నివేదికను కార్మిక మంత్రిత్వ శాఖ సోమవారం తోసిపుచ్చింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసే కేఎల్‌ఈఎంఎస్‌ డేటా, పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌)   వంటి అధికారిక గణాంకాల నుంచి లభించే సమగ్ర, సానుకూల ఉపాధి డేటాను పరిగణనలోకి తీసుకోవడంలో సిటీ గ్రూప్‌ విఫలమైందని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందుబాటులో ఉన్న అధికారిక గణాంకాలను విశ్లేషించకుండా సిటీ గ్రూప్‌ నివేదిక సిద్ధం చేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పీఎల్‌ఎఫ్‌ఎస్, కేఎల్‌ఈఎంఎస్‌ డేటా ప్రకారం, 2017-18 నుంచి 2021-22 వరకు భారత్‌ 8 కోట్లకు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించింది. అంటే సగటున ఏడాదికి 2 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు చూపించింది.

  • ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ప్రకారం, 2023-24లో 1.3 కోట్ల మందికి పైగా చందాదార్లు ఈపీఎఫ్‌ఓలో చేరారు. 2018-19లో ఈపీఎఫ్‌ఓలో చేరిన 61.12 లక్షల మందితో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. పీఎల్‌ఎఫ్‌ఎస్, ఆర్‌బీఐ, ఈపీఎఫ్‌ఓ వంటి అధికారిక సంస్థల డేటా ప్రకారం, కార్మిక విపణి మెరుగవుతోంది. నిరుద్యోగిత రేటు గత 5 ఏళ్లుగా తగ్గుతూ వస్తోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని