Govt: పెట్రోల్‌, డీజిల్‌ జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు సిద్ధమే.. కానీ..!

పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రాలు మాత్రం అంగీకరించకపోవచ్చని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హరిదీప్‌ సింగ్‌ పూరీ అభిప్రాయపడ్డారు.

Published : 14 Nov 2022 21:12 IST

శ్రీనగర్‌: పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్టీ (GST) పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ పేర్కొన్నారు. అయితే, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తాయని అనుకోవడం లేదన్నారు. రాష్ట్రాలకు మద్యం (Liquor), ఇంధనం ప్రధాన ఆదాయ వనరులని, అటువంటి వాటిని అవి వదులుకునేందుకు అవి సిద్ధంగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. చాలా దేశాల్లో ఇంధన సంక్షోభం ఉన్నప్పటికీ.. భారత్‌లో మాత్రం మారుమూల ప్రాంతంలోనూ ఇంధన కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.

పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటే రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రాలు అందుకు అంగీకరిస్తే, మేం కూడా సిద్ధమే. ముందునుంచి ఇదే విషయం చెబుతున్నాం. ఇది నాకు తెలిసిన విషయం. అయితే, ఎలా అమలు చేయాలన్నదే మరో సమస్య. ఈ ప్రశ్న ఆర్థిక మంత్రిని అడగాలి’ అని విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి తెలిపారు. మద్యం, ఇంధనం.. ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న రాష్ట్రాలు ఇందుకు అంగీకరించకపోవచ్చన్నారు.

దీన్ని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. వీటివల్లే రాష్ట్రాలు ఆదాయం పొందుతున్నాయి. ఆదాయం వస్తుంటే ఎవరు వదిలేస్తారు..? మద్యం, ఇంధనం ఆదాయం తెచ్చిపెట్టే అంశాలు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌లో చర్చించాలని కేరళ హైకోర్టు కూడా సూచించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కానీ, ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి అందుకు అంగీకరించలేదన్నారు.

ఇంధన ధరలు పెరగడంపై స్పందించిన కేంద్ర మంత్రి.. అమెరికాలో ఒక్క ఏడాదే ఇంధన ధరలు 43 శాతం పెరిగితే, భారత్‌లో కేవలం రెండు శాతం మాత్రమే పెరిగాయని అన్నారు. పొరుగు దేశాల్లోనూ ఇంధన సంక్షోభం ఉందని.. అక్కడ వాటి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటూ దేశంలో ఇంధన ధరల పెరుగుదలను నియంత్రిస్తున్నామని చెప్పారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని