Published : 05 Jul 2022 15:14 IST

Electric vehicles: ఈవీ కంపెనీలకు కేంద్రం షోకాజ్ నోటీసులు.. నెలాఖరు డెడ్‌లైన్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో పలు చోట్ల విద్యుత్‌ వాహనాల్లో (Electric vehicle) మంటలు చెలరేగిన ఉదంతాల పట్ల ఆగ్రహంగా ఉన్న కేంద్రం.. ఆ వాహనాలు తయారు చేసిన కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు పంపించింది. ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric), ఒకినావా (okinawa), ప్యూర్‌ ఈవీ (Pure EV) వంటి కంపెనీలు షోకాజ్‌ నోటీసులు అందుకున్న జాబితాలో ఉన్నాయి. లోపాలు ఉన్న విద్యుత్‌ వాహనాలను ప్రజలకు విక్రయించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ నోటీసుల్లో కేంద్రం పేర్కొంది. జులై నెలాఖరు వరకు గడువు విధించింది. ఆలోగా కంపెనీలు తమ స్పందన తెలియజేయాలని కేంద్రం సూచించింది. కంపెనీలిచ్చిన సమాధానం ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా విద్యుత్‌ వాహనాల విక్రయాలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో వాటిలో మంటలు చెలరేగిన ఘటనలూ వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు సంభవించడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో మంటల్లో చిక్కుకున్న వాహన కంపెనీలకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీపీపీఏ) షోకాజ్‌ నోటీసులు పంపింది. రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సైతం ఆయా కంపెనీలు తెలియజేసే స్పందన కోసం వేచి చూస్తున్నాయి. బ్యాటరీ సెల్స్‌, డిజైన్‌లో లోపాల వల్లే ఈ ఘటనలు జరుగుతున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనలపై ఏర్పాటైన కమిటీ ఈ విషయాన్ని ప్రాథమికంగా గుర్తించి ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నోటీసులు పంపించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts