e commerce: ఈ కామర్స్‌ సైట్లలో ఫేక్‌ రివ్యూల అడ్డుకట్టకు ప్రభుత్వం చర్యలు

నకిలీ రివ్యూలకు అడ్డుకట్ట  వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు శనివారం వెల్లడించింది....

Published : 28 May 2022 15:15 IST

దిల్లీ: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మీషో.. ఇలా ఈ-కామర్స్‌ సైట్ల నుంచి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఆ ఉత్పత్తిపై గతంలో కొన్నవారి అభిప్రాయాలను చూస్తుంటాం. వాటి ఆధారంగానే కొనాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటాం. కానీ, ఒక్కోసారి కొంతమంది నకిలీ రివ్యూలు కూడా పోస్ట్‌ చేస్తుంటారు. దీనివల్ల ఇటు కొనుగోలుదారులతో పాటు అటు విక్రేతలు, ఈకామర్స్‌ సంస్థలకు కూడా నష్టం. ఈ నేపథ్యంలో నకిలీ రివ్యూలకు అడ్డుకట్ట  వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు శనివారం వెల్లడించింది.

నకిలీ రివ్యూల బెడదపై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ, అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ASCI) కలిసి ఈ-కామర్స్‌ సంస్థలు, ఇతర స్టేక్‌హోల్డర్లతో శుక్రవారం సమావేశమయ్యాయి. వినియోగదారులను నకిలీ రివ్యూలు పక్కదారి పట్టిస్తున్నాయని తేల్చాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించాయి. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న విధానాలతో పాటు విదేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయనున్నాయి. ఈ సమావేశంలో కన్జ్యూమర్‌ ఫోరం, లా యూనివర్శిటీలు, న్యాయవాదులు, ఫిక్కీ, సీఐఐ, వినియోగదారుల హక్కుల కార్యకర్తలు.. తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు