Microsoft - ChatGPT: మైక్రోసాఫ్ట్‌ ‘ChatGPT’ వచ్చేసింది.. ఎంచక్కా ‘బింగ్‌’లోనే వాడేయొచ్చు!

మైక్రోసాఫ్ట్‌ (Microsoft) తన సెర్చ్‌ ఇంజిన్‌ బింగ్‌ (Bing)లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)ను యాడ్‌ చేసింది. దీంతో ఛాట్‌ జీపీటీ (ChatGPT) తరహా సేవలు అందిస్తామని చెబుతోంది. 

Published : 10 Feb 2023 14:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్నాలజీ ప్రపంచంలో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ChatGPT. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence) తో పని చేసే ఈ టూల్‌.. యూజర్లకు తక్కువ సమయంలో కచ్చితమైన, అవసరమైన సమాచారం ఇస్తుందని ఆ టూల్‌ను కనిపెట్టిన ఓపెన్‌ ఏఐ (Open AI) చెబుతోంది. దీంతో ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్ల పని ఇక అయిపోయింది అంటూ వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో సెర్చ్‌ ఇంజిన్లు కూడా ఆ దిశగా అడుగులేస్తున్నాయి. మొన్నటికి మొన్న గూగుల్‌ ‘బార్డ్‌’ (Google Bard) ని అనౌన్స్‌ చేయగా, ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ ఏకంగా ఈ సర్వీసులను లైవ్‌లోకి తీసుకొచ్చింది.

మైక్రోసాఫ్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌ అయిన బింగ్‌లో ఛాట్‌జీపీటీ తరహా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. AI ఆధారిత ఆన్సర్‌ ఇంజిన్‌ ద్వారా ఈ సేవలు అందిస్తామని చెబుతోంది. యూజర్లందరికీ యాక్సెస్‌లోకి వచ్చింది అని చెబుతున్నా.. ప్రస్తుతానికి ‘వెయిట్‌ లిస్ట్‌’ ప్రాసెస్‌లో సేవలు అందిస్తోంది. అంటే ఈ సేవలను యాక్సెస్‌ చేయాలనుకునేవారు తొలుత వెయిట్‌ లిస్ట్‌లోకి చేరాలి. ఆ తర్వాత మీ విడత వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్‌ నుంచి సమాచారం వస్తుంది. అప్పుడు డెస్క్‌టాప్‌లో ఈ సేవలు పొందొచ్చు. మొబైల్‌లో ఎప్పటి నుంచి ఈ సేవలు ఉంటాయి అనేది ఇంకా టీమ్‌ వెల్లడించలేదు.

వెయిట్‌లిస్ట్‌ ప్రాసెస్‌ ఇలా..

  • డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌లో ఎడ్జ్‌ బ్రౌజర్‌ ఓపెన్‌ చేయండి. 
  • అడ్రెస్‌ బార్‌లో bing.com అని సెర్చ్‌ చేయండి. 
  • అప్పుడు ఛాట్‌ బాక్స్‌ ఒకటి ఓపెన్‌ అవుతుంది. అందులో ask me anything అని ఉంటుంది. 
  • ఆ దిగువన నాలుగు డమ్మీ ప్రశ్నలు కనిపిస్తాయి. దాని దిగువ Try it అని ఉంటుంది. 
  • Try it బటన్‌ను క్లిక్‌ చేస్తే.. ఆ పైన ఉన్న ప్రశ్నకు సమాచారం వస్తుంది. అలాగే కుడివైపున ఓ ఛాట్‌ బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. 
  • ఛాట్‌ బాక్స్‌ దిగువన Join the waitlist అనే ఆప్షన్‌ వస్తుంది. 
  • వెయిట్‌లిస్ట్‌ బటన్‌ను క్లిక్‌ చేస్తే మైక్రోసాఫ్ట్ మెయిల్‌  లాగిన్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. 
  • మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, తదితర వివరాలు ఇస్తే.. మీరు వెయిట్‌ లిస్ట్‌లో ఉన్నారు అని వస్తుంది. 
  • వెయిట్‌ లిస్ట్‌లో ఉన్నవారికి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చినప్పుడు మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తారు. 

బింగ్‌ ద్వారా అందుబాటులోకి వచ్చే ఛాట్‌ జీపీటీ తరహా సేవలు ఎలా ఉంటాయో చూపించేలా బింగ్‌ ఇప్పటికే కొన్ని ఉదాహరణలు, వాటి సమాధానాలు చూపిస్తోంది. ఇంచుమించు ఛాట్‌ జీపీటీ తరహాలోనే ఆ సమాధానాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా అందుబాటులోకి వచ్చాక దీని పూర్తి ఫీచర్లు తెలుస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని