Pre-Owned Car: పాత కారు కొంటున్నారా? ఇవన్నీ చూశాకే..!
చాలా మంది వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. కొందరు కొత్త వాహనం కొంటే.. మరికొందరు పాత వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. మరి పాత వాహనాలను కొనేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలేంటో చూద్దాం...
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణాలకు ఇష్టపడుతున్నారు. స్తోమత ఉన్నవాళ్లు కొత్త కారు కొంటే.. లేనివాళ్లు సెకండ్‌హ్యాండ్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, కొత్త వాహనాన్ని కొంటే దాన్ని పెద్దగా పరిశీలించాల్సిన అవసరం లేదు. గ్యారెంటీలు, ఉచిత సర్వీసింగ్‌లు కూడా ఉంటాయి. అదే మరి పాతబండిని కొనేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం...
సర్వీసు రికార్డు, పత్రాలు: రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా పాలసీ, కార్ ఇన్వాయిస్ వంటి అన్ని అవసరమైన పత్రాలను తనిఖీ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా సర్వీసు రికార్డుపై ఓ కన్నేయాలి. దీని ద్వారా క్రమం తప్పకుండా వాహనానికి సర్వీసింగ్ చేయించారా, లేదా తెలుస్తుంది. అంతేకాకుండా.. మెకానికల్ భాగాలు మార్చారా లేదంటే పెద్ద మరమ్మతు ఏదైనా జరిగిందా అనేదీ బయటపడుతుంది.
తయారీ తేదీ: కారులో విండ్‌షీల్డ్ సహా ప్రతీ గ్లాస్‌పైన తయారీ ఏడాది, నెల ముద్రించి ఉంటుంది. అన్ని అద్దాలపై ఒకే తేదీ ఉంటే సరే. వేర్వేరు ఉంటే అద్దాలు మార్చారనీ, ప్రమాదం జరిగిందని గ్రహించాలి. డాష్‌బోర్డులో కనిపించే డ్యామేజీ ఏదైనా ఉందేమో చెక్ చేయాలి. దీన్ని బట్టే కారును సదరు యజమాని ఎంత బాగా నిర్వహిస్తున్నారో తెలుస్తుంది. హుడ్ను పైకెత్తి ఇంజిన్ బ్లాక్‌ను చెక్ చేయాలి. ఆయిల్ లీకేజీ ఏమైనా ఉందేమో గమనించాలి. కనిపించే లోహ భాగాలకు ఏమైనా తుప్పు పట్టిందా అని కూడా చూడాలి. కారులోని అన్ని ఎలక్ట్రిక్ భాగాలను పరీక్షించాలి. ముఖ్యంగా ఏసీ, పవర్ విండోలు, హెచ్‌వీఏసీ సిస్టమ్‌ను అడ్జస్ట్ చేస్తూ వేర్వేరు సెట్టింగ్స్‌లో సరిగా పనిచేస్తుందో లేదో చూడొచ్చు. మ్యూజిక్ సిస్టమ్‌కు సంబంధించి స్టీరింగ్‌పై ఉండే కంట్రోల్స్‌ను సరిచూడాలి.
ఎక్స్టీరియర్: వాహనం హుడ్, మిర్రర్లు, గ్రిల్, బానెట్, బంపర్, డోర్లు, విండ్‌షీల్డ్, బూట్.. ఇలా ప్రతిదీ క్షుణ్నంగా పరిశీలించాలి. డెంట్లు, తుప్పు పట్టడం, గీతలు పడటం ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టే బేరం ఆడొచ్చు. బానెట్ తెరిచి హోసెస్, బెల్టులు, ఏసీ కాయిల్, రేడియేటర్, బ్యాటరీ, ఫ్యాన్ సరిగా పనిచేస్తున్నాయో లేదో గమనించాలి. వీటిలో ఏది చెడిపోయినా ఖర్చు ఎక్కువ అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యం ఇంజిన్. దీని పనితీరు ఎలా ఉందో తెలియాలంటే తప్పనిసరిగా బండిని నడిపి చూడాలి. గేర్లు మార్చినప్పుడు, బ్రేక్‌లు వేసినప్పుడు, మూలమలుపుల్లో ఇంజిన్ నుంచి శబ్దాలు వస్తుంటే సమస్య ఉందని తెలుసుకోవచ్చు. న్యూట్రల్ గేరులో ఒకట్రెండు నిమిషాలు ఉంచినప్పుడు ఏవైనా వైబ్రేషన్లు, శబ్దాలు వస్తున్నా లోపం ఉందని అర్థం. యాక్సిలరేటర్, క్లచ్‌లు, బ్రేక్‌లు, బ్రేక్ పెడళ్లూ ఇవన్నీ చూడాలి.
మైలేజీ: లీటర్ ఇంధనంతో సగటున ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలుసుకోవాలి. అలాగే ఇప్పటి వరకు బండి ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో కూడా చూసుకోవాలి. కనీసం ఒక 15 కి.మీ నడిపితే.. మైలేజీపై ఓ అవగాహన వస్తుంది. అలాగే బండి కొని ఎన్నేళ్లవుతుందో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మరీ పాతదైతే.. విడి భాగాలు దొరకడం కష్టం. భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తే వెంట తెలిసిన మెకానిక్‌ను తీసుకెళ్లడం ఉత్తమం. మీరు కొంటున్న వాహనం ధర మార్కెట్లో ఎంత పలుకుతుందో చూసుకోవాలి. ఆన్లైన్లో కాస్త వెతికితే.. మీరు కొనబోయే బండికి ఎంత వరకు చెల్లించొచ్చన్నది ఒక అవగాహన వస్తుంది.
పెయింట్: కారుపై చిన్న డెంట్లు, స్క్రాచ్‌లు ఉంటే పెద్ద పట్టించుకోనవసరం లేదు. ఏదైనా భాగానికి రీపెయింట్ వేశారేమో చూడాలి. బంపర్లకు మళ్లీ పెయింట్ వేస్తే భయపడాల్సిన అవసరం లేదు. కానీ, లోహ భాగాలకు రీపెయింట్ వేస్తే దానికి పెద్ద ప్రమాదం జరిగిందని అర్థం. అలాగే తుప్పును దాచడానికీ అలా చేసి ఉండొచ్చు. టైర్లు సైతం కారు పరిస్థితేంటో చెబుతాయి. చౌక టైర్లు ఉంటే ఆ వాహనం జోలికి వెళ్లొద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్‌లైన్‌ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్‌షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్‌లను ప్రారంభించారు. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
Automobile Sales: ఫిబ్రవరి వాహన విక్రయాల్లో 13% వృద్ధి
Automobile Sales: ఫిబ్రవరిలో వాహన విక్రయ గణాంకాలను ఫాడా గురువారం వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన గత నెలలో 13 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. -
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ కొత్త మోడళ్లు
బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్ శ్రేణిలో 2024 సంవత్సర మోడళ్లను విపణిలోకి విడుదల చేసింది. -
టాటా ఎస్‌యూవీల్లో డార్క్ సిరీస్‌లు
టాటా మోటార్స్ తన నెక్సాన్ ఎస్యూవీ బ్రాండ్‌లో డార్క్ సిరీస్‌లను విడుదల చేసింది. సంప్రదాయ ఐసీఈ ఇంజిన్, విద్యుత్తు మోడళ్లలోనూ ఇవి అందుబాటులో ఉంటాయి. -
మార్కెట్లోకి BYD సీల్ EV.. 15 నిమిషాల ఛార్జింగ్‌తో 200km ప్రయాణం
BYD: చైనా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం BYD.. సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ధర, ఇతర వివరాలు ఇవీ.. -
మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్
సరికొత్త డిజైన్, ప్రీమియం ఫీచర్లతో థార్ ఎర్త్ ఎడిషన్‌ను మహీంద్రా ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో, కావాల్సిన యాక్సెసరీస్‌తో ఈ కార్లను కొనుగోలు చేసుకోవచ్చు. -
కొత్త ఫీచర్లతో టీవీఎస్ హెచ్‌ఎల్‌ఎక్స్ 150ఎఫ్ బైక్
మోటార్‌సైకిల్ టీవీఎస్ హెచ్‌ఎల్‌ఎక్స్ అమ్మకాలు అంతర్జాతీయంగా 35 లక్షల స్థాయిని అధిగమించిన సందర్భంగా, అదనపు ఫీచర్లతో టీవీఎస్ హెచ్‌ఎల్‌ఎక్స్ 150ఎఫ్‌ను విడుదల చేస్తున్నట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ వెల్లడించింది. -
మహీంద్రా స్కార్పియో-ఎన్ జెడ్8 సెలెక్ట్
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) సంస్థ, ‘స్కార్పియో-ఎన్ జెడ్8 సెలెక్ట్’ వేరియంట్‌ను గురువారం విడుదల చేసింది. -
భారత్‌లోకి కొత్త కవాసకి నింజా 500
ఇండియా కవాసకి మోటార్స్, దేశీయ విపణిలోకి 2024 నింజా 500ను తీసుకొచ్చింది. ఈ వాహనాన్ని పూర్తిగా తయారైన స్థితి (సీబీయూ)లో దిగుమతి చేసుకుంటున్నారు. -
kawasaki: కవాసకి నుంచి కొత్త బైక్.. ధర రూ.9.29 లక్షలు
kawasaki z900: ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి జెడ్ 900 పేరుతో కొత్త బైక్‌ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
Hero MotoCorp: వచ్చే ఆర్థిక సంవత్సరం టూవీలర్ పరిశ్రమలో రెండంకెల వృద్ధి: హీరో మోటోకార్ప్
Hero MotoCorp: ప్రీమియం బైక్‌లకు ఆదరణ పుంజుకుంటోందని హీరోమోటోకార్ప్ సీఈఓ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరాకీ మెరుగవుతోందని చెప్పారు. -
Ola Electric: ఓలా ఆఫర్.. ఈ స్కూటర్లపై ₹25 వేల వరకు తగ్గింపు
Ola Electric: విద్యుత్ స్కూటర్లపై ఓలా ఎలక్ట్రిక్ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.25వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. -
ప్రయాణికుల వాహన అమ్మకాల్లో 14% వృద్ధి
ప్రయాణికుల వాహన (పీవీలు) అమ్మకాలు జనవరిలో 14 శాతం పెరిగి 3,93,074 వాహనాలుగా నమోదయ్యాయి. జనవరి నెలకు గాను ఇప్పటివరకు ఇవే అత్యధిక విక్రయాలు కావడం గమనార్హం. -
Vehicle Sales: జనవరిలో రికార్డు స్థాయి గరిష్ఠానికి ప్రయాణికుల వాహన విక్రయాలు
Vehicle Sales: 2023 జనవరిలో 3,47,086 యూనిట్ల పీవీలు అమ్ముడు కాగా.. ఈసారి అవి 13 శాతం పెరిగి 3,93,250కి చేరాయి. -
ఈవీలపై టాటా మోటార్స్ డిస్కౌంట్.. ₹1.2 లక్షల వరకు తగ్గింపు
Tata motors: టాటా మోటార్స్ తన విద్యుత్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించింది. నెక్సాన్, టియాగో మోడళ్లపై రూ.1.2 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. -
Maruti Suzuki: ఎర్రసముద్రం అలజడితో వ్యయాలు పెరగొచ్చు: మారుతీ సుజుకీ
Maruti Suzuki: ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హూతీల దాడుల వల్ల వ్యయాలు పెరిగే అవకాశం ఉందని మారుతీ సుజుకీ పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’ - దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?