
CIBIL Score: సిబిల్ స్కోరు ఎంతుంటే రుణాలు సులభంగా లభిస్తాయి?
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఇండియా) లిమిటెడ్.. క్రెడిట్ స్కోరును మూడు అంకెల సంఖ్యలో జారీ చేస్తుంది. సాధారణంగా సిబిల్ స్కోరు 300 నుంచి 900 వరకు ఉంటుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోరు ఉన్న వ్యక్తులను బాధ్యతాయుతమైన రుణగ్రహీతలుగా పరిగణిస్తారు. సిబిల్ స్కోరు విభిన్న శ్రేణులు, వాటి సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం.
750-900..
ఇది అద్భుతమైన శ్రేణి. సిబిల్ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉంటే..ఆ వ్యక్తి క్రెడిట్ చెల్లింపులు క్రమం తప్పకుండా ఉన్నాయని అర్థం. ఇది ఆకట్టుకునే రుణ చెల్లింపు చరిత్రను సూచిస్తుంది. రుణాలు చెల్లించడంలో విఫలమయ్యే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి బ్యాంకులకు రిస్క్ తక్కువ ఉంటుంది. అందువల్ల క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువ నిర్వహించే వ్యక్తులకు బ్యాంకులు రుణాలు, క్రెడిట్ కార్డులను సులభంగా మంజూరు చేస్తాయి.
700-749..
మీ సిబిల్ స్కోర్ ఈ పరిధిలో ఉంటే, మీ రుణ చరిత్ర బాగానే ఉందని అర్ధం. అయితే, బ్యాంకులు రుణ దరఖాస్తు తర్వగానే ఆమోదిస్తాయి. అయితే, తక్కువ వడ్డీ రేటు కోసం బ్యాంకును సంప్రదించాలంటే మరింత స్కోరును పెంచుకోవడం అవసరం కావచ్చు.
600-699..
ఈ శ్రేణిలో సిబిల్ స్కోర్ ఉంటే.. సకాలంలో బకాయిలను చెల్లించడానికి మీరు ఇబ్బంది పడుతున్నారని అర్థం. రిస్క్ పెరుగుతుంది. దీంతో బ్యాంకులు రుణం మంజూరు చేయడానికి ఆలోచిస్తాయి. ఈ స్థాయిలో క్రెడిట్ స్కోరు ఉన్నా పర్వాలేదు కానీ ఇంతకంటే తక్కువకు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నించాలి.
350 - 599...
ఈ పరిధిలోని సిబిల్ స్కోరు ప్రమాదకర స్థాయిని సూచిస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లులు, రుణాలు సమయానికి చెల్లించడంలో విఫలం అవుతున్నారని అర్థం. ఈ శ్రేణిలో సిబిల్ స్కోరు ఉంటే..రిస్క్ అధికంగా ఉంటుంది కాబట్టి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు, క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు విముఖత చూపుతాయి.
ఎన్ఏ/ ఎన్‌హెచ్(NA/NH)..
క్రెడిట్ చరిత్ర లేని వ్యక్తులకు సిబిల్ స్కోరు NA/NH గా చూపిస్తుంది. క్రెడిట్ కార్డు ఉపయోగించని లేదా మునుపెన్నడూ రుణం తీసుకోని వ్యక్తులకు క్రెడిట్ చరిత్ర ఉండదు.
చివరిగా..
రుణాలు సులభంగా లభించాలన్నా, తక్కువ వడ్డీ రేటుకే పొందాలన్నా మంచి క్రెడిట్ స్కోరును నిర్వహించడం చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు క్రెడిట్ కార్డు బిల్లులను, తీసుకున్న రుణాలను సమయానికి చెల్లించండి. అలాగే మీ రుణ వినియోగ నిష్పత్తి(మీకు లభించిన పరిమితి లో మీరు వాడుకున్న శాతం) 30 శాతం మించకుండా చూసుకోవడం మంచిది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Presidential Election: ‘రబ్బరు స్టాంపు’గా ఉండబోనని ప్రతిజ్ఞ చేయాలి: యశ్వంత్ సిన్హా
-
India News
Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
-
India News
Digital India: ఆన్లైన్ వ్యవస్థతో ‘క్యూ లైన్’ అనే మాటే లేకుండా చేశాం: మోదీ
-
Sports News
IND vs ENG: జో రూట్ హాఫ్ సెంచరీ.. 200 దాటిన ఇంగ్లాండ్ స్కోర్
-
India News
Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
-
India News
Eknath Shinde: పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తాం.. శిందే కీలక ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- బిగించారు..ముగిస్తారా..?
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు