WhatsApp Digilocker: వాట్సాప్‌లో హాయ్‌ చెప్పండి.. డిజీలాక‌ర్ సేవ‌లు పొందండి!

ఇప్పుడు డిజీలాక‌ర్ సేవ‌ల‌ను వాట్సాప్ ద్వారా పొంద‌వ‌చ్చు

Updated : 23 May 2022 17:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడు డిజీలాక‌ర్ సేవ‌ల‌ను వాట్సాప్ ద్వారా పొంద‌వ‌చ్చు. మ‌రింత పార‌ద‌ర్శకంగా, సులభంగా ప్ర‌భుత్వ సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచడంలో భాగంగా ప్ర‌భుత్వం MyGov హెల్ప్‌డెస్క్‌ను గ‌తంలోనే ప్రారంభించింది. అయితే, తాజాగా దీని ద్వారా వాట్సాప్ నుంచి కూడా డిజీలాక‌ర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన్న‌ట్లు 'ఎలక్ట్రానిక్స్ & ఐటీ' మంత్రిత్వ శాఖ సోమవారం ప్ర‌క‌టించింది. 

దీంతో పాన్‌కార్డ్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి పాసింగ్ స‌ర్టిఫికేట్‌, వాహ‌న రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్ (ఆర్‌సీ), ద్విచ‌క్ర వాహ‌న బీమా పాల‌సీ, 10వ త‌ర‌గ‌తి మార్క్‌షీట్‌, 12వ త‌ర‌గ‌తి మార్క్‌షీట్‌, బీమా పాల‌సీ ప‌త్రాలు (డిజీలాక‌ర్‌లో అందుబాటులో ఉన్న లైఫ్‌/నాన్ లైఫ్ బీమా పాల‌సీ ప‌త్రాలు) త‌దిత‌ర ప‌త్రాల‌ను వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ వాట్సాప్ వినియోగదారులు చాట్‌బాట్ ద్వారా ‘+91 9013151515’ నెంబ‌రుకు ‘న‌మ‌స్తే' లేదా 'హాయ్' లేదా 'డిజీలాక‌ర్’ అని పంపించ‌డం ద్వారా ఈ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. 

కొవిడ్-19 మ‌హ‌మ్మారిపై పోరాటంలో భాగంగా మార్చి 2020లో.. వాట్సాప్‌లో MyGov హెల్ప్‌డెస్క్‌ను ప్ర‌భుత్వం ప్రారంభించింది. గ‌తంలో దీన్ని క‌రోనా హెల్ప్‌డెస్క్‌ అని పిలిచేవారు. కొవిడ్ సంబంధిత స‌మాచారం, వ్యాక్సిన్‌ అపాయింట్‌మెంట్, వ్యాక్సిన్‌ స‌ర్టిఫికేట్ డౌన్‌లోడ్ వంటి సేవల‌ను అందిస్తూ వ‌చ్చింది. డిజిలాక‌ర్‌లో ఇప్ప‌టికే దాదాపు 10 కోట్ల మంది రిజిస్ట‌ర్ చేసుకున్నారు. 500 కోట్ల‌కు పైగా డాక్యుమెంట్లు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని