సీఎంఎఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక

నథింగ్‌ సబ్‌ బ్రాండ్‌ సీఎంఎఫ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీనటి రష్మిక వ్యవహరించనున్నారు.

Updated : 03 Jul 2024 17:37 IST

Nothing: ప్రముఖ టెక్‌ కంపెనీ నథింగ్ తన సబ్ బ్రాండ్ సీఎంఎఫ్‌ (CMF)కు సినీనటి  రష్మిక (Rashmika mandanna)ను  ప్రచారకర్తగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నథింగ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. రష్మికను సీఎంఎఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడం పట్ల నథింగ్‌ ఇండియా ప్రెసిడెంట్ విశాల్‌ భోలా ఆనందం వ్యక్తం చేశారు. వినియోగదారులకు అవసరమైన పరికరాలను రూపొందించడంలో సీఎంఫ్‌ ముందుంటుందని తెలిపారు. 

ప్రధాన బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు ఇవే..

సీఎంఎఫ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా తనను నియమించడంపై రష్మిక సంతోషం వ్యక్తం చేశారు. కంపెనీ ప్రత్యేకమైన ఉత్పత్తులు, రంగులు ఆకర్షించాయని తెలిపారు. ప్రముఖ టెక్‌ సంస్థతో కలసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సీఎంఎఫ్‌ ఫోన్‌1 డిజైన్‌ను ఆవిష్కరించింది. ఈ మొబైల్‌ నలుపు, ఆరెంజ్‌, లైట్‌ గ్రీన్‌, బ్లూ రంగుల్లో లభిస్తుందని తెలిపింది. వాచ్‌ ప్రో2, బడ్స్‌ ప్రో 2తో పాటు సీఎంఎఫ్‌ ఫోన్‌1 ను జులై8న లాంచ్‌ చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని