సామూహిక పెట్టుబ‌డి ప‌థ‌కాలు- స్కీమా లేక స్కామా?

రూ.ల‌క్ష పెట్టండి... నెల‌లో రూ.2ల‌క్ష‌లు చేస్తామ‌ని ఊద‌ర‌గొట్టే ప‌థ‌కాల‌తో జాగ్ర‌త్త‌!....

Updated : 01 Jan 2021 18:14 IST

చ‌ట్టంలో నిర్వ‌చ‌నం ఎలా ఉంది? షేర్లు, బాండ్లు, డిపాజిట్ల మాదిరిగా కాకుండా సామూహిక పెట్టుబ‌డి ప‌థ‌కాలు లేదా క‌లెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌(సీఐఎస్‌) పెట్టుబ‌డిదారుల‌కు ర‌క‌ర‌కాల ఆప్ష‌న్ల‌ను అందిస్తుంది. అందుకే అవి పెట్టుబ‌డి పెట్టే తీరును బ‌ట్టి వాటిని వ‌ర్గీక‌రిస్తారు. సెక్యూరిటీస్ న్యాయ స‌వ‌ర‌ణ చ‌ట్టం, 2014 ప్ర‌కారం సామూహిక పెట్టుబ‌డి ప‌థ‌కాలంటే నిర్వ‌చ‌నం ఇచ్చారు. దీని ప్ర‌కారం ఏదైనా ప‌థ‌కం లేదా ఏర్పాటు ప్ర‌క్రియ‌తో రూ.100కోట్ల‌కు పైగా జ‌మ‌చేసే మొత్తాన్ని సీఐసీగా పరిగ‌ణిస్తారు. ఇవి దీని కిందికి రావు? చ‌ట్టంలో పేర్కొన్న‌ట్టుగా రూ.100కోట్ల పైగా నిధుల‌ను సేక‌రించే అన్ని ప‌థ‌కాలు దీని కింద‌కి వ‌స్తాయంటే పొర‌పాటే. కొన్ని నియంత్రిత ప‌థ‌కాల‌ను దీన్నుంచి మిన‌హాయించారు. దీంట్లో భాగంగా కో-ఆప‌రేటివ్ సొసైటీలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ‌లు సేక‌రించే డిపాజిట్లు, బీమా కాంట్రాక్టులు, నియంత్రిత పింఛ‌ను ప‌థ‌కాలు, కంపెనీల చ‌ట్టాల‌ను అనుస‌రించి సేక‌రించే కార్పొరేట్ డిపాజిట్లు, ప‌ర‌స్ప‌ర అంగీకార సొసైటీలు లేదా రిజిస్ట‌ర్ పొందిన చిట్ ఫండ్ సంస్థ‌లు… ఇంకా మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు దీని కిందికి రావు.

సెబీతో రిజిస్ట‌ర్ కావాలి:
పైన పేర్కొన్న సంస్థ‌లు కాకుండా ఇత‌ర ఏదైనా సంస్థ రూ.100కోట్ల‌కు పైన నిధులను స‌మీక‌రించేందుకు సెబీ వ‌ద్ద సీఐఎస్‌గా రిజిస్ట‌ర్ పొందాల్సి ఉంటుంది. అలా చేయ‌లేదు అంటే అది చ‌ట్ట‌వ్య‌తిరేక సంస్థ అని చెప్పొచ్చు. పోంజి ప‌థ‌కాల్లో ఇరుక్కోకుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. రాత్రికి రాత్రే డ‌బ్బును రెండింత‌లు చేస్తామ‌ని చెప్పే వారి ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి. ఆమోదం పొందిన ఆర్థిక సంస్థ‌ల‌తోనే పెట్టుబ‌డులు పెట్ట‌డం ఎప్ప‌టికీ మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని