Gas Cylinder Price: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్‌పై భారీ తగ్గింపు..
నిత్యావసరాల ధరల మోతతో అల్లాడిపోతున్న వేళ ఇంధన తయారీ సంస్థలు ఓ శుభవార్త చెప్పాయి. వాణిజ్య సిలిండర్ ధరపై భారీ తగ్గింపు ప్రకటించాయి
దిల్లీ: నిత్యావసరాల ధరల మోతతో అల్లాడిపోతున్న వేళ ఇంధన తయారీ సంస్థలు ఓ శుభవార్త చెప్పాయి. వాణిజ్య సిలిండర్ (Commercial cylinder) ధరపై భారీ తగ్గింపు ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.135 మేర తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు బుధవారం వెల్లడించాయి. ఈ తగ్గింపు నేటి(జూన్ 1) నుంచే అమల్లోకి వస్తుందని తెలిపాయి.
తాజా తగ్గింపుతో దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ (Commercial cylinder) ధర రూ.2,335.50 నుంచి రూ.2,219కు దిగొచ్చింది. ముంబయిలో ఈ సిలిండర్ ధర రూ.2,171.50, కోల్‌కతాలో రూ.2,322, చెన్నైలో రూ.2,373గా ఉంది. హైదరాబాద్‌లో ఈ సిలిండర్ ధర రూ.2,427.50కు తగ్గింది. చమురు సంస్థల నిర్ణయంతో చిరు వ్యాపారులు, హోటల్ యజమానులకు కాస్త ఊరట లభించినట్లయింది.
అయితే, గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల (Domestic Gas Cylinder) ధరల్లో మాత్రం చమురు సంస్థలు ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర దిల్లీలో రూ.1,003గా ఉంది. అయితే, ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.200 (12 సిలిండర్ల వరకు) రాయితీ ఇవ్వనున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!