Stock market: పసిడి-వెండి రాణింపు

పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలించొచ్చు. అమెరికా ఉద్యోగ గణాంకాలకు తోడు డాలర్‌ బలహీనపడే వీలుండటం ఇందుకు నేపథ్యం. బంగారం కాంట్రాక్టుకు రూ.73,666 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది.

Published : 08 Jul 2024 01:52 IST

కమొడిటీస్‌ ఈ వారం

పసిడి

పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలించొచ్చు. అమెరికా ఉద్యోగ గణాంకాలకు తోడు డాలర్‌ బలహీనపడే వీలుండటం ఇందుకు నేపథ్యం. బంగారం కాంట్రాక్టుకు రూ.73,666 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.73,979;  రూ.74,867 వరకు రాణించొచ్చు. ఒకవేళ రూ.71,892 కంటే దిగువన ట్రేడయితే  రూ.70,746; రూ.70,118 వరకు దిగి వచ్చే అవకాశం ఉంటుంది. రూ.71,892 దిగువన లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం మేలు. 


వెండి

వెండి సెప్టెంబరు కాంట్రాక్టుకు రూ.90,358 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.87,121; రూ.85,207 వరకు దిగిరావచ్చు. ఒకవేళ పైకి వెళితే రూ.95,509 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని మించితే రూ.97,423; రూ.1,00,660 వరకు రాణించే అవకాశం ఉంటుంది.


ప్రాథమిక లోహాలు

  • రాగి జులై కాంట్రాక్టు రూ.846.75 కంటే దిగువన చలించకుంటే, సానుకూల ధోరణిలో కదలాడేందుకు అవకాశం ఉంటుంది. 
  • సీసం జులై కాంట్రాక్టు రూ.188.60 కంటే దిగువన కదలాడితే, రూ.187.15; రూ.186.05 వరకు దిద్దుబాటు కావచ్చు. అదేవిధంగా రూ.191.15 కంటే పైన చలిస్తే రూ.192.25; రూ.193.70 వరకు రాణించే అవకాశం ఉంటుంది.
  • జింక్‌ జులై కాంట్రాక్టు రూ.267.15 కంటే దిగువన చలించకుంటే.. లాంగ్‌ పొజిషన్ల వైపు మొగ్గు చూపడం మంచి వ్యూహమే అవుతుంది. రూ.276.45; ఆ తర్వాత రూ.283.95 వరకు పెరిగే అవకాశం ఉంది.
  • అల్యూమినియం జులై కాంట్రాక్టుకు రూ.236.35 వద్ద నిరోధం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.238.90; రూ.242.10 వరకు పెరుగుతుందని భావించొచ్చు. ఒకవేళ రూ.230.65 కంటే కిందకు వస్తే రూ.227.50; 224.95 వరకు పడిపోవచ్చు.

ఇంధన రంగం

ముడి చమురు జులై కాంట్రాక్టు రూ.6,837 కంటే దిగువన చలిస్తే రూ.6,709; రూ.6,602 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ సానుకూలంగా చలిస్తే రూ.7,072 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. దీన్ని అధిగమిస్తే రూ.7,179; రూ.7,307 వరకు పెరగొచ్చు.

  • సహజవాయువు జులై కాంట్రాక్టుకు రూ.188.20 వద్ద మద్దతు ఉంది. దీని కంటే దిగువకొస్తే రూ.180.80, రూ.166.70 వరకు దిద్దుబాటు కావచ్చు. రూ.209.70 కంటే ఎగువన కదలాడితే మాత్రం రూ.223.80; రూ.231.20 వరకు కాంట్రాక్టు రాణించే అవకాశం ఉంటుంది.

వ్యవసాయ ఉత్పత్తులు

పసుపు ఆగస్టు కాంట్రాక్టుకు రూ.15,441 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.15,026; రూ.14,297 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ సానుకూల ధోరణిలో చలిస్తే రూ.16,585 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.17,314; రూ.17,729 వరకు పెరుగుతుందని భావించొచ్చు. 

  • పత్తి క్యాండీ జులై కాంట్రాక్టుకు రూ.58,713 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఒకవేళ కిందకు వస్తే రూ.57,743 వద్ద మద్దతు లభించొచ్చు.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని