నిక‌ర రాబ‌డి లెక్కిస్తున్నారా?

నిక‌ర రాబ‌డి అంచ‌నా వేయండం ద్వారా మంచి పెట్టుబ‌డి మార్గాల‌ను ఎంచుకోవ‌చ్చు​​​​​​....

Published : 19 Dec 2020 11:27 IST

నిక‌ర రాబ‌డి అంచ‌నా వేయండం ద్వారా మంచి పెట్టుబ‌డి మార్గాల‌ను ఎంచుకోవ‌చ్చు​​​​​​​

వ్య‌క్తి త‌న పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే నిక‌ర రాబ‌డి ప‌ట్ల స‌రియైన అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌డం ఎంతో అవ‌సరం. పెట్టుబ‌డిపై ఎంత రాబ‌డి వ‌స్తుంద‌నే విష‌యాన్ని ముందుగానే అంచ‌నా వేసుకోవాలి. అయితే మ‌న‌లో చాలా మంది ఈ విష‌యాన్ని ప్ర‌తీ సారీ విశ్మ‌రిస్తుంటారు. ముందుగా చెల్లించ‌వ‌ల‌సిన ప‌న్నులు, ప‌న్ను చెల్లించిన అనంత‌రం వ‌చ్చే రాబ‌డి మొద‌లైన అంశాల‌పై నిక‌ర రాబ‌డి ఆధార‌ప‌డి ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కి:

ఒక వ్య‌క్తి త‌న కుమార్తె పుట్టిన రోజు వేడుక‌లు ఒక ప్ర‌ముఖ‌ రెస్టారెంటులో చేశాడు. ఆ రెస్టారెంటు వారు అత‌నికి ఒక ఆఫ‌ర్ ఇచ్చారు. క‌నీసం 100 బోజ‌నం ప్యాకెట్‌లు తీసుకుంటే ప్యాకెట్‌కు రూ. 99 మాత్రం చెల్లిస్తే స‌రిపోతుంది అని చెప్పారు . అత‌ను 100 ప్యాకెట్‌ల‌కు గాను రూ.9,900 చెల్లించాల్సి వ‌స్తుంద‌ని లెక్కించి ఆర్డ‌ర్ ఇచ్చాడు. 5శాతం జీఎస్‌టీ, 5 శాతం సేవా రుసుముతో క‌లిపి చివ‌రి బిల్లు రూ.10,890 వ‌చ్చింది.

అత‌ను లెక్కించిన దానికంటే 10 శాతం బిల్లు అధికంగా రావ‌డంతో అత‌ను ఆర్చ‌ర్య‌పోయి వెళ్ళి మేనేజ‌ర్ ను అడిగాడు. పాల‌సీ ప్ర‌కారం ఎటువంటి ఆఫ‌ర్లోనైనా ప‌న్ను, సేవా రుసుము విడిగా వ‌ర్తిస్తాయ‌ని, ఆ చార్జీలు వారు త‌మ సొంతానికి తీసుకోవ‌డం లేద‌ని, ప్ర‌భుత్వం వారికి చెల్లించాల‌ని మేనేజ‌ర్ స‌మాధానం ఇచ్చారు. నిజానికి రెస్టారెంటు వారు ఇచ్చిన ఆఫ‌ర్ రేటు క‌న్నా ఎక్కువ చార్జీలు విధించ‌లేదు.

ఇక్క‌డ రెండు ముఖ్య విష‌యాలు గుర్తు పెట్టుకోవాలి. మొద‌టిది ప‌న్ను, రెండోది నెట్ జౌట్ ఫ్లో. పై ఉదాహ‌ర‌ణ‌లోని వ్య‌క్తి త‌ను చేసే ఖ‌ర్చుల‌పై ప‌న్ను, స‌ర్‌చార్జీల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోలేదు. నిజానికి ప‌న్ను 18 శాతం వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ అంతవ‌ర‌కు ప‌రిగితే అత‌ని ఔట్ ఫ్లో ఇంకా గ‌ణ‌నీయంగా పెరిగి ఉండేది.

రెస్టారెంటు మేజ‌న‌ర్ ఇచ్చిన ఆఫ‌ర్‌లోగాని, వ్య‌వ‌హ‌రించిన విధానంలో గాని ఏ మాత్రం త‌ప్పు లేదు. వినియోగ‌దారుడు త‌మ ద‌గ్గ‌ర నుంచి ఎంత వెళుతుంది, ఎంత వ‌స్తుంది అనే అంశాలు అర్ధంచేసుకోవాలి. ఇది “టేక్ హోమ్ సేల‌రిని” పోలి ఉంటుంది. ఒక ఉద్యోగి, జీతం నుంచి పన్నులతో సహా అన్ని మినహాయింపులు తీసివేసిన‌ తర్వాత కంపెనీ నుంచి పొందే నిక‌ర ఆదాయం ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుంటాడు కానీ, త‌న మీద కంపెనీకి అయ్యే మొత్తం ఖ‌ర్చును ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోడు.

మేనేజ‌ర్ చెప్ప‌న‌ట్లు ప‌న్నులు వ‌సూలు చేయ‌గా వ‌చ్చిన డ‌బ్బు రెస్టారెంటు కోసం కాదు. ప్ర‌భుత్వానికి చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. ఇది వేరు వేరు వ్య‌క్తుల‌కు వారు చేసే వ్య‌యం ఆధారంగా వేరు వేరుగా ఉంటుంది.

పెట్టుబడిదారులు వారి పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే నిక‌ర రాబ‌డుల‌ను కూడా ఈవిధంగానే లెక్కించ‌వ‌ల‌సి ఉంటుంది. ఉదాహరణకు, స్థిర డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు రెండింటిలోను 8 శాతం వ‌డ్డీ వ‌స్తుంద‌నుకుందాం. స్థిర డిపాజిట్ల‌పై ప‌న్ను ఉంటుంది. కాబ‌ట్టి వారు ఉన్న టాక్స్ స్లాబ్ ఆధారంగా 10,20,30,35 శాతం వ‌ర‌కు ప‌న్ను చెల్లించాలి. అప్పుడు స్థిర డిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీ నుంచి చెల్లించిన ప‌న్నును తీసివేస్తే వ‌చ్చే నిక‌ర రాబ‌డి 8 శాతం నుంచి 6.60 శాతానికి ప‌డిపోతుంది. అదే పీపీఎఫ్‌పై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది కాబ‌ట్టి 8 శాతం వ‌డ్డీని పొంద‌వ‌చ్చు. పైన ఇచ్చిన రెండింటిలో పీపీఎఫ్‌లు లాభ‌దాయ‌కంగా ఉన్నాయి అదేవిధంగా మీరు ఎందులో పెట్టుబ‌డి పెట్టిన దానిపై ఉన్న ప‌న్ను, సేవా రుసుము వంటివి తీసివేసిగా వ‌చ్చే నిక‌ర‌ రాబ‌డిని అంచానా వేసి లాభాదాయ‌కంగా ఉండే పెట్టుబ‌డి మార్గాల‌ను ఎంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని