
రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా? అయితే ఒకసారి వీటిని పరిశీలించండి..
మీరు తక్కువ వడ్డీ రేటుకే రుణం పొందాలనుకుంటున్నారా? అయితే, దాని కోసం మీరు మంచి క్రెడిట్ స్కోర్ ను కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. క్రెడిట్ స్కోర్ అనేది మీరు తిరిగి చెల్లించే సామర్ధ్యాన్ని సూచిస్తుంది. అలాగే మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
వివిధ రుణదాతల వడ్డీ రేట్లను పోల్చి చూడండి:
సాధారణంగా, మీ ఖర్చులకు తగిన ఆదాయం లేని సందర్భంలో లేదా అనారోగ్య పరిస్థితుల్లో లేదా ఫోన్/కారును కొనుగోలు చేయడం వంటి అవసరాల కోసం రుణాలను తీసుకుంటారు.
చాలా మంది రుణం తీసుకునే సమయంలో వడ్డీ రేట్లను పరిశీలించకుండా, కేవలం సులువుగా రుణం పొందడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. అలా కాకుండా తక్కువ వడ్డీ రేటు కోసం వివిధ ఆర్ధిక సంస్థలను సంప్రదించాల్సిందిగా ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే, రుణం కోసం ఇప్పటికే పొదుపు ఖాతా లేదా ఏదైనా ఇతర బ్యాంకింగ్ సంబంధాన్ని కలిగి ఉన్న ఆర్థిక సంస్థలను ఎంచుకోవడం మంచిది.
రుణ చెల్లింపుకు తక్కువ కాలపరిమితిని ఎంపిక చేసుకోండి:
సాధారణంగా, ఆర్థిక సంస్థలు మీకు అనేక రుణ కాలపరిమితి ఆప్షన్లను అందిస్తాయి. ఎక్కువ కాలపరిమితిని ఎంచుకున్నట్లైతే, తక్కువ ఈఎంఐని చెల్లించాలి. అదే తక్కువ కాలపరిమితిని ఎన్నుకున్నట్లైతే, ఎక్కువ ఈఎంఐని చెల్లించాలి.
ఉదాహరణకు, మీరు మూడు సంవత్సరాల కాలపరిమితికి గాను 11 శాతం వడ్డీ రేటుతో రూ. 5 లక్షల రుణం తీసుకున్నట్లైతే, మీరు చెల్లించాల్సిన ఈఎంఐ రూ. 16,369 గా ఉంటుంది. అదే ఐదు సంవత్సరాల కాలపరిమితికి అయితే రూ. 10,871 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ కాలపరిమితిని ఎంచుకున్నట్లైతే వడ్డీ కింద ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అందువలన తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం ఉత్తమం.
ప్రాసెసింగ్ చార్జీలు, పెనాల్టీ లను తనికీ చేయండి:
సాధారణంగా రుణ గ్రహీతలు ప్రాసెసింగ్ చార్జీలపై ఎక్కువగా ద్రుష్టి పెట్టరు. ఒకవేళ ప్రాసెసింగ్ చార్జ్ ఎక్కువగా ఉండి, వడ్డీ రేటు 10 నుంచి 15 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) కంటే తక్కువగా ఉన్నట్లయితే, అప్పుడు మీరు పెద్దగా ప్రయోజనం పొందకపోవచ్చు. ఇక్కడ మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే పెనాల్టీ చార్జీలు. ఉదాహరణకు, చాలా ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాలపై ముందస్తు చెల్లింపు పెనాల్టీ చార్జీలను విధిస్తున్నారు. ఒకవేళ మీరు రుణానికి సంబంధించి ముందస్తు చెల్లింపు చేసినట్లయితే, మీరు కొంత మేర పెనాల్టీ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. మీరు రుణాన్ని తీసుకునే ముందు, ముందస్తు చెల్లింపు పెనాల్టీ చార్జీలను తనికీ చేసుకోవడం మంచిది, అలాగే 'లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్' కోసం రుణం తీసుకోవడం మంచిది కాదు.
అందువలన మీరు రుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు, వడ్డీ రేట్లను పోల్చి చూడండి, అలాగే తక్కువ కాలపరిమితిని ఎంపిక చేసుకోండి. అదే విధంగా ప్రాసెసింగ్ చార్జీలు, పెనాల్టీ చార్జీలను కూడా తనికీ చేయండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rishabh Pant: అఫ్రిదికి చేరువలో పంత్.. ఈసారి విరుచుకుపడితే రికార్డు బద్దలే!
-
Business News
BSNL Prepaid Plans: కొత్త ప్లాన్ల పేరిట టారిఫ్‌లు పెంచేసిన బీఎస్ఎన్ఎల్!
-
Politics News
Raghurama: ఆ లిస్టులో నా పేరు లేదంటే ఆశ్చర్యపోయా: ఎంపీ రఘురామ
-
Politics News
Chirag Paswan: మరో ‘శిందే’ కోసం భాజపా, జేడీయూల వెతుకులాట..!
-
Business News
Amazon primeday sale: ప్రైమ్ యూజర్లూ అలర్ట్.. ప్రైమ్ డే సేల్ ఈ సారి ముందుగానే!
-
Politics News
Harish Rao: భాజపా నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదు: హరీశ్‌రావు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్