80% కస్టమర్లు డిస్‌క్లైమర్లను గుర్తించడం లేదు: యాస్కీ

ప్రతి ప్రొడక్ట్‌పై డిస్‌క్లైమర్‌ ఇవ్వడం చాలా అవసరమని యాస్కీ సీఈఓ మనీషా కపూర్‌ అన్నారు. అయితే దానిని వినియోగదారులు అర్థం చేసుకొనేలా సరళంగా, పొట్టిగా రాయాలని సూచించారు.

Published : 24 Jan 2023 18:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మార్కెట్‌లోకి విడుదల చేసే వస్తువులు, ఆహార పదార్థాలు, సౌందర్య ఉత్పత్తులపై డిస్‌క్లైమర్లు (disclaimers) తప్పనిసరి. అంటే వాటిని ఉపయోగించడం వల్ల కలిగే దుష్ఫరిణామాలను కచ్చితంగా పేర్కొనాల్సిందే. అయితే వినియోగదారుల్లో చాలా మందికి వీటిపై పెద్దగా అవగాహన ఉండడం లేదని తాజా సర్వే ఒకటి తేల్చింది. దీనికి డిస్‌క్లైమర్‌ (disclaimers)లో ఉండే సమాచారం చాలా పొడవుగా, సంక్లిష్టంగా, పరిమాణంలో చదవడానికి కూడా వీల్లేనంత చిన్నగా ఉండడమే కారణమని తమ సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది అభిప్రాయపడ్డారని ‘అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ASCI)’ తెలిపింది.

దాదాపు 33 శాతం మంది వినియోగదారులు అసలు డిస్‌క్లైమర్‌ (disclaimers)లో ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని యాస్కీ తెలిపింది. 62 శాతం మంది షరతులు చాలా పొడవుగా ఉండడం వల్ల చదవలేకపోతున్నామని తెలిపినట్లు పేర్కొంది. 80 శాతం మంది అసలు డిస్‌క్లైమర్లను గుర్తించలేకపోయారని వెల్లడించింది. గత మూడేళ్లలో డిస్‌క్లైమర్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్న 800 ప్రకటనలను గుర్తించినట్లు తెలిపింది.  

ప్రతి ఉత్పత్తిపై డిస్‌క్లైమర్‌ (disclaimers) ఇవ్వడం చాలా అవసరమని యాస్కీ సీఈఓ మనీషా కపూర్‌ అన్నారు. అయితే దానిని వినియోగదారులు అర్థం చేసుకొనేలా సరళంగా, పొట్టిగా రాయాలని సూచించారు. ఈ క్రమంలో సమాచారాన్ని తొక్కిపెట్టొద్దని తెలిపారు. దీనిపై అన్ని సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. ఒక్క ఫ్రేమ్‌లో ఒక దానికి మించి డిస్‌క్లైమర్లను ఇవ్వొద్దని తెలిపారు. అదే టీవీ ద్వారా ఇచ్చే ప్రకటనలో డిస్‌క్లైమర్‌ చదవటానికి వీలుగా ఉండాలని సూచించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని