Published : 04 Aug 2022 16:46 IST

NPS rule change: ఎన్‌పీఎస్‌ చెల్లింపుల్లో కీలక మార్పు

NPS rule change: జాతీయ పింఛను పథకం (NPS) చెల్లింపు విధానంలో ‘పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA)’ కీలక మార్పులు చేసింది. ఎన్‌పీఎస్‌ టైర్‌-2 ఖాతాకు నెలనెలా చేసే చెల్లింపులను క్రెడిట్‌ కార్డు ద్వారా స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ కొత్త నిబంధన ఎన్‌పీఎస్‌ టైర్‌-1 ఖాతాలకు వర్తించదని తెలిపింది.

ఎన్‌పీఎస్‌ టైర్‌-2 ఖాతా కొత్తగా తెరిచే వారి నుంచి కూడా క్రెడిట్‌ కార్డు ద్వారా చేసే చెల్లింపులను స్వీకరించబోయేది లేదని పీఎఫ్‌ఆర్‌డీఏ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ‘పాయింట్‌ ఆఫ్‌ పర్చేజ్‌’లో ఎక్కడా ఎన్‌పీఎస్‌ టైర్‌-2 చెల్లింపుల్ని క్రెడిట్‌ కార్డు ద్వారా స్వీకరించొద్దని ఆదేశించింది. ఈ కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. సాధారణంగా మ్యూచువల్ ఫండ్‌లు లేదా స్టాక్‌లలో పెట్టుబడి కోసం క్రెడిట్ కార్డ్ చెల్లింపులను సంస్థలు ప్రోత్సహించవు. ఎందుకంటే అటువంటి చెల్లింపుల్లో అధిక వడ్డీతో కూడిన డబ్బును పరపతిగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎన్‌పీఎస్‌ ఖాతాదారులు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే 0.60 శాతం పేమెంట్‌ గేట్‌వే ఛార్జీ భరించాల్సి ఉంటుంది. దీనికి జీఎస్టీ కూడా తోడైతే అది మరింత అధికమవుతుంది.

టైర్‌-2 ఎన్‌పీఎస్‌ ఖాతా తెరవడం స్వచ్ఛందం. టైర్‌-1 ఖాతా ఉన్నవారే దీనికి అర్హులు. అయితే, టైర్‌-2 ఖాతాలో చేసే పెట్టుబడులకు ఆదాయ పన్ను ప్రయోజనాలు వర్తించవు. పైగా ఈ ఖాతా నుంచి కావాల్సినప్పుడు నిష్క్రమించవచ్చు. అదే టైర్‌-1 ఖాతాకు నిర్దేశిత కాలం పాటు లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. రూ.1000 కనీస మొత్తంతో ఎన్‌పీఎస్‌ టైర్‌-2 ఖాతా తెరిచే అవకాశం ఉంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని