ఈక్విటీ మార్కెట్లలో ‘దిద్దుబాటు’ అంటే ఏమిటి?

మీరు దీర్ఘకాలిక ఈక్విటీలలో పెట్టుబడి పెడితే,  స్టాక్ మార్కెట్ దిద్దుబాట్ల గురించి ఆందోళన చెందకూడదు.

Published : 19 Jul 2021 12:14 IST

ఈక్విటీ మార్కెట్లు ఇటీవల చారిత్రక గరిష్ట స్థాయిని తాకినప్పుడు, స్టాక్ మార్కెట్ ర్యాలీకి, ఆర్ధిక వృద్ధికి స‌మ‌తుల్యం లేనందున మార్కెట్లు దిద్దుబాటుకు గుర‌య్యే అవ‌కాశ‌ముంద‌ని కొంత‌మంది నిపుణులు హెచ్చ‌రించారు. కానీ ఈ “దిద్దుబాటు” అంటే ఏమిటి?  

స్టాక్ మార్కెట్ పరిభాషలో, ఒక దిద్దుబాటు ఈక్విటీ మార్కెట్ల ఇటీవలి గరిష్ట స్థాయి నుంచి వాస్త‌వ స్థాయికి పతనం అని నిర్వచనం. సాంకేతికంగా చెప్పాలంటే, ఒక దిద్దుబాటు సూచిక విలువ  52 వారాల గరిష్ట స్థాయి నుంచి కనీసం 10 శాతం ప‌డిపోతుంది. 2020 లో, కోవిడ్‌ను మహమ్మారిగా ప్రకటించినందున, ఎస్ & పి బిఎస్‌ఇ సెన్సెక్స్ రెండు నెలల వ్యవధిలో 38 శాతం దిగువ‌కు చేరింది. కొన్ని సార్లు మార్కెట్ 10 శాతానికి పైగా సరిదిద్దిన సందర్భాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ దిద్దుబాటు ఎంతకాలం ఉంటుంది అనేది ఎవరు అంచనా వేయ‌లేరు. ఇది నెలల వ్యవధిలో సరిదిద్దడం కొనసాగిస్తే, దానిని బేర్ రన్ అని పిలుస్తారు.

మార్కెట్ దిద్దుబాటును అంచనా వేయడానికి ఏదైనా మార్గం ఉందా? అంటే  లేద‌నే చెప్పాలి.  స్టాక్ మార్కెట్ దిద్దుబాటు ఎప్పుడు, ఎంతకాలం ఉంటుందో ఎవ్వరూ మీకు చెప్పలేరు.

కాబట్టి, మీరు స్టాక్ మార్కెట్ దిద్దుబాటుతో ఎలా వ్యవహరించాలి? అంటే దీర్ఘకాలిక ఈక్విటీలలో పెట్టుబడి పెడితే,  స్టాక్ మార్కెట్ దిద్దుబాట్ల గురించి ఆందోళన చెందకూడదు.  దిద్దుబాటు అయిన‌ప్పుడు పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలి, ఎందుకంటే అప్పుడు స్టాక్ ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉంటాయి.  దీంతో దిద్దుబాటు తరువాత మార్కెట్లు ర్యాలీ చేసినప్పుడు మీకు ప్రయోజనం ఉంటుంది.

మార్కెట్లు ర్యాలీ చేసినట్లయితే  మీ పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించాలి. పెరుగుతుంద‌ని అప్పు చేసి మ‌రీ పెట్టుబ‌డులు చేయ‌కూడ‌దు. అలాగే   మీ ఈక్విటీ కేటాయింపు మీరు కోరుకున్న స్థాయిలకు మించి ఉంటే, అందులో పెట్టుబ‌డుల‌ను త‌గ్గించి , డెట్ ఫండ్ల వంటి వంటి సురక్షితమైన పెట్టుబ‌డుల‌కు మారాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని