Drones: డ్రోన్ల సాయంతో కొరియర్‌ డెలివరీ

డ్రోన్ల ద్వారా కొరియర్‌ డెలివరీని విజయవంతంగా ప్రారంభించినట్లు    బ్లూడార్ట్‌ తెలిపింది. ఇందుకోసం డ్రోన్‌ సాంకేతికతలో దిగ్గజమైన స్కై ఎయిర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది.

Updated : 20 Jun 2024 08:38 IST

స్కై ఎయిర్‌తో బ్లూడార్ట్‌ ఒప్పందం 

దిల్లీ: డ్రోన్ల ద్వారా కొరియర్‌ డెలివరీని విజయవంతంగా ప్రారంభించినట్లు బ్లూడార్ట్‌ తెలిపింది. ఇందుకోసం డ్రోన్‌ సాంకేతికతలో దిగ్గజమైన స్కై ఎయిర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. తన రవాణా వ్యవస్థలను మెరుగుపర్చుకోవడానికి డ్రోన్‌ సాంకేతికతనూ ఉపయోగించుకుంటున్నట్లు ఎక్స్ఛేంజీలకు బ్లూడార్ట్‌ సమాచారమిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం 2021 సెప్టెంబరులో తీసుకొచ్చిన ‘మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై’ కార్యక్రమం కింద హైదరాబాద్‌ సమీపంలోని వికారాబాద్‌లో ఔషధాలను డ్రోన్ల ద్వారా సరఫరా చేసే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహించినట్లు పేర్కొంది. ఇ-కామర్స్‌ రంగంపై దృష్టి సారిస్తున్నామని, డ్రోన్ల ద్వారా షిప్‌మెంట్లను ఒకే రోజులో డెలివరీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్లూడార్ట్‌ వెల్లడించింది. వీటి వల్ల డెలివరీ సమయం బాగా తగ్గుతుందని, పర్యావరణంపై ప్రతికూల ప్రభావమూ అదుపులోకి వస్తుందని కంపెనీ ఎండీ బాల్ఫోర్‌ మాన్యుయెల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు