‘కొవాగ్జిన్‌’ వాలంటీర్ల నమోదు ప్రక్రియ పూర్తి

కరోనా వైరస్‌ నిరోధానికి ‘కొవాగ్జిన్‌’ టీకాను అభివృద్ధి చేస్తున్న భారత్‌ బయోటెక్‌ సంస్థ కీలక ప్రకటన చేసింది. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు వాలంటీర్ల

Updated : 07 Jan 2021 16:28 IST

ప్రకటించిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నిరోధానికి ‘కొవాగ్జిన్‌’ టీకాను అభివృద్ధి చేస్తున్న భారత్‌ బయోటెక్‌ సంస్థ కీలక ప్రకటన చేసింది. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు వాలంటీర్ల ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్టు వెల్లడించింది. మూడో దశలో 26వేల మందికి టీకా ఇవ్వాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు వాలంటీర్లుగా 25,800 మంది ఎన్‌రోల్‌ చేసుకోవడం విశేషం. టీకా అభివృద్ధిలో తమకు  మద్దతుగా నిలుస్తున్న అందరికీ భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల కృతజ్ఞతలు తెలిపారు.  

మరోవైపు, భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవాగ్జిన్‌ పేరుతో సొంతంగా అభివృద్ధి చేసిన టీకాకు డీసీజీఐ అత్యవసర వినియోగ అనుమతులు మంజూరుచేసిన విషయం తెలిసిందే. 1-2 దశల పరీక్షల ఫలితాల ఆధారంగా ఈ అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకు 16 వైరస్‌ టీకాలను ఆవిష్కరించి ప్రపంచ దేశాలకు అందిస్తున్నామని, తాము తయారుచేసిన కొవాగ్జిన్‌ సురక్షితమైందని ఆ సంస్థ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి.. 

కొవాగ్జిన్‌ టీకా పూర్తిగా సురక్షితం

టీకా పంపిణీకి కలిసి పనిచేస్తాం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని