22 నుంచి క్రేయాన్స్‌ అడ్వర్టైజింగ్‌ ఐపీఓ

క్రేయాన్స్‌ అడ్వర్టైజింగ్‌ రూ.41.8 కోట్ల ఐపీఓ 2023, మే 22 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమయి. మే 25న ముగుస్తుంది.

Published : 17 May 2023 17:34 IST

దిల్లీ: స్వదేశీ అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీ అయిన క్రేయాన్స్‌ అడ్వర్టైజింగ్‌ రూ.41.80 కోట్ల ఐపీఓ మే 22న (సోమవారం) సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కానుంది. మే 25న ముగుస్తుంది. ఒక్కో షేరు ధర రూ.62-65గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాని సొంత ఫిల్మ్‌, యానిమేషన్‌ స్టూడియోలను ఏర్పాటు చేయడానికి, సాంకేతికతలతో సహా మరింత డైనమిక్‌ మెటావర్స్‌ సొల్యూషన్‌లను అందించడానికి, వెబ్‌3 సామర్థ్యాలకు సంబంధించిన ప్రస్తుత పునాదిని మెరుగుపరచడానికి పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

1986లో స్థాపించిన, క్రేయాన్స్‌ అడ్వర్టైజింగ్‌ కంపెనీ బ్రాండ్‌ స్ట్రాటజీ, ఈవెంట్‌లు, డిజిటల్‌ మీడియా, ప్రింట్‌ మీడియా, అవుట్‌డోర్‌ మీడియా సేవలతో కూడిన అడ్వర్టైజింగ్‌ మీడియా సేవల కోసం హై-ఎండ్‌ ఎకోసిస్టమ్‌, ఎండ్‌-టు-ఎండ్‌ యాడ్‌-టెక్‌ కమ్యూనికేషన్‌ సొల్యూషన్స్‌ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తోంది. ఇది వార్తా పత్రికలు, బ్రోచర్‌లు, మ్యాగజైన్‌లు, టెలివిజన్‌ ఛానెల్‌లు, ఎఫ్‌ఎం ఛానెల్‌లు, అవుట్‌డోర్‌ హోర్డింగ్‌ల ప్రదర్శన వంటి ప్రకటన మోడ్‌లను కవర్‌ చేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని