ICICI Credit Card: క్రెడిట్ కార్డుతో ₹2 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా

వాడ‌కాన్ని బ‌ట్టి ఒక సంవ‌త్స‌రానికి గ‌రిష్టంగా 10,000 రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి.

Updated : 30 Aug 2022 13:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీఐసీఐ బ్యాంక్‌ కోర‌ల్ రూపే పేరిట కొత్త క్రెడిట్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. రూపే నెట్‌వ‌ర్క్‌లో ఈ క్రెడిట్ కార్డుల శ్రేణిని ప్రారంభించేందుకు ఐసీఐసీఐ బ్యాంకు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (NPCI)తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగ‌స్వామ్యంతో ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ప్ర‌యోజ‌నాలు, రూపే ప్ర‌త్యేక ఆఫ‌ర్‌ల‌తో క‌లిపి వినియోగ‌దారుల‌కు అందుతాయి.

ఐసీఐసీఐ బ్యాంకు కోర‌ల్ రూపే క్రెడిట్ కార్డు అనేది కాంటాక్ట్‌లెస్ కార్డు. షాపింగ్‌, రెస్టారెంట్‌లు, యుటిలిటీ బిల్లుల చెల్లింపు, కాంప్లిమెంట‌రీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ & రైల్వే లాంజ్ యాక్సెస్‌, ఇంధ‌న స‌ర్‌ఛార్జ్ మిన‌హాయింపు, రోజువారీ కొనుగోళ్ల‌పై రివార్డ్ పాయింట్లు స‌హా అనేక ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. సినిమా టికెట్ల   కొనుగోళ్లలు, భోజనాల బిల్లులపై ఈ కార్డు ద్వారా రాయితీలు పొందొచ్చు. కోర‌ల్ రూపే క్రెడిట్ కార్డుతో రూ.2 ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా క‌వ‌రేజీ సౌక‌ర్యం ఉంటుంది.

రివార్డులు

ఈ కార్డు ద్వారా (ఇంధ‌నం మినహాయించి) చేసే ప్ర‌తి రూ.100 ఖ‌ర్చుపై 2 రివార్డు పాయింట్లు వ‌స్తాయి. వినియోగ వస్తువులు, బీమా కేట‌గిరీల‌పై ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూ.100పై ఒక రివార్డు పాయింటు వ‌స్తుంది. ఒక సంవ‌త్స‌రంలో కార్డుపై రూ. 2 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తే 2000 బోన‌స్ రివార్డు పాయింట్లు, అద‌నంగా రూ.1 ల‌క్ష ఖ‌ర్చు చేస్తే 1000 బోన‌స్ రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి. వాడ‌కాన్ని బ‌ట్టి ఒక సంవ‌త్స‌రానికి గ‌రిష్ఠంగా 10 వేల రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి.

ఇత‌ర ప్ర‌యోజ‌నాలు

దేశీయ విమానాశ్ర‌య లాంజ్‌ల‌లో, ఎంపిక చేసిన రైల్వే లాంజ్‌ల‌లో కాంప్లిమెంట‌రీ యాక్సెస్ సౌక‌ర్యం ఉంటుంది. బుక్‌మైషో సినిమా టికెట్లపై త‌గ్గింపు ఉంటుంది. అంతేకాకుండా 24 గంట‌లూ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిగ‌త ఆన్‌లైన్ స‌ర్వీసు సౌక‌ర్యం ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకు కలినరీ ట్రీట్స్ ప్రోగ్రామ్ ద్వారా రెస్టారెంట్లలో డైనింగ్ ఆఫ‌ర్లు, ఇంధ‌న లావాదేవీల‌పై ఇంధ‌న స‌ర్‌ఛార్జీ మిన‌హాయింపు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని