బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఎవరికి ఇస్తాయ్
బ్యాంకులు క్రెడిట్ కార్డు ఎవరికి ఇచ్చే అవకాశముంటుంది. సులభంగా క్రెడిట్ కార్డు పొందాలంటే ఏం చేయాలి. క్రెడిట్ కార్డు చెల్లింపులు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. సమయానికి చేతిలో డబ్బు లేనప్పుడు క్రెడిట్ కార్డును వినియోగించవచ్చు. మన ఆర్థిక అవసరాలను తీర్చే క్రెడిట్ కార్డును జారీ చేసేందుకు బ్యాంకులు వివిధ అంశాలను పరిశీలిస్తాయి. అవి…
బ్యాంకులు క్రెడిట్ కార్డు ఎవరికి ఇచ్చే అవకాశముంటుంది. సులభంగా క్రెడిట్ కార్డు పొందాలంటే ఏం చేయాలి. క్రెడిట్ కార్డు చెల్లింపులు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. సమయానికి చేతిలో డబ్బు లేనప్పుడు క్రెడిట్ కార్డును వినియోగించవచ్చు. మన ఆర్థిక అవసరాలను తీర్చే క్రెడిట్ కార్డును జారీ చేసేందుకు బ్యాంకులు వివిధ అంశాలను పరిశీలిస్తాయి. అవి…
క్రెడిట్ స్కోర్:
క్రెడిట్ కార్డు జారీ చేసేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వినియోగదారుడి క్రెడిట్ స్కోర్, క్రెడిట్ చరిత్రను పరిశీలిస్తాయి. సాధారణంగా 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ కలిగి ఉంటే క్రెడిట్ కార్డు సులభంగా లభిస్తుంది. అందుకే సమయానికి క్రెడిట్ కార్డు బిల్లు, రుణాలను చెల్లిస్తుంటే స్కోర్ మెరుగుపడుతుంది. ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకుంటూ లోపాలు లేకుండా చూసుకోవాలి. మొత్తం క్రెడిట్ లిమిట్లో 30 నుంచి 40 శాతం కంటే ఎక్కువగా వినియోగించకపోవడం మంచిది.
ఆదాయం:
మీ ఆదాయం కూడా క్రెడిట్ కార్డు పొందేందుక కీలకం అని చెప్పుకోవచ్చు. ఇతర అన్ని అంశాలు బాగున్నప్పటికీ మీకు రెగ్యులర్ ఆదాయం లేకపోతే అప్లికేషన్ తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఎక్కువ ప్రయోజనాలు ఉన్న క్రెడిట్ కార్డులు పొందాలంటే ఎక్కువ ఆదాయం ఉండాల్సి ఉంటుంది.
ఉద్యోగం లేదా వ్యాపారం:
మీ వృత్తి లేదా ఉద్యోగాన్ని, క్రెడిట్ కార్డు జారీ చేసేవారు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుంటారు.ఇతరులతో పోలిస్తే వేతన జీవులకు క్రెడిట్ కార్డ్ పొందేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏ కంపెనీలో పని చేస్తున్నారు, ఎంత వేతనం పొందుతున్నారు అన్నదానిని కీలకంగా పరిశీలిస్తారు. తిరిగి చెల్లించగలుగుతారన్న నమ్మకం ఉంటేనే క్రెడిట్ కార్డు ఇస్తారు.
ప్రాంతం:
క్రెడిట్ కార్డు కోసం దాఖలు చేసుకున్న వినియోగదారుడి ప్రాంతం కూడా కార్డు జారీపై ప్రభావం చూపుతుంది. కొన్ని ప్రాంతాలను బ్యాంకులు బ్లాక్-లిస్టెడ్ ఏరియాస్ లేదా నెగెటివ్ ఏరియాస్ గా పేర్కొంటాయి. ఆ ప్రాంతాలలో ఉన్నవారికి క్రెడిట్ కార్డు జారీ చేసేందుకు సుముఖత చూపవు. ఈ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను తిరస్కరించే అవకాశముంటుంది.
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్:
క్రెడిట్ కార్డ్ పొందేందుకు అర్హత లేనివారు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను పొందవచ్చు. బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లను బట్టి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను అందిస్తాయి. ఆదాయం, ప్రాంతం, ఉద్యోగం, క్రెడిట్ స్కోరుతో సంబంధం లేకుండా బ్యాంకులు ఈ కార్డులను జారీ చేస్తాయి. క్రెడిట్ చరిత్రను మెరుగుపరుచుకునేందుకు ఇదొక మంచి మార్గం.
ఈ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపితే రుణం తీసుకున్నట్లుగానే పరిగణిస్తారు. క్రెడిట్ స్కోర్ లెక్కించేటప్పుడు వీటిని కూడా కలుపుతారు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండటం లేదా అసలు లేకపోవడం చేత క్రెడిట్ స్కోర్ ఇచ్చేందుకు తిరస్కరిస్తే ఈ కార్డులను ఉపయోగించి స్కోర్ మెరుగుపరుచుకోవచ్చు. అన్ని ఆదాయ వర్గాల వారు ఈ కార్డును పొందేందుకు వీలుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు