శాకాహార భోజన ఖర్చు 10% అధికం

శాకాహార భోజనం (వెజ్‌ థాలి) సగటు ధర జూన్‌లో 10% పెరిగిందని క్రిసిల్‌ తాజా నివేదికలో వెల్లడించింది.

Published : 06 Jul 2024 01:55 IST

బంగాళాదుంప, టమాటా ధరల్లో పెరుగుదల వల్లే: క్రిసిల్‌

ముంబయి: శాకాహార భోజనం (వెజ్‌ థాలి) సగటు ధర జూన్‌లో 10% పెరిగిందని క్రిసిల్‌ తాజా నివేదికలో వెల్లడించింది. బ్రాయిలర్‌ చికెన్‌ ధర తగ్గడంతో.. మాంసాహార భోజనం (నాన్‌ వెజ్‌ థాలి) ఖర్చు తగ్గిందని తన నెలవారీ ‘రోటీ రైస్‌ రేట్‌’ నివేదికలో తెలిపింది. 

  • అన్నం, కూరగాయలు (ఉల్లి, టమాటా, బంగాళాదుంపలు), రోటి, పెరుగు, సలాడ్‌తో ఉండే వెజ్‌ థాలి ప్లేట్‌ సగటు ధర 2023 జూన్‌లో రూ.26.70 కాగా.. ఈ ఏడాది జూన్‌లో 10% పెరిగి రూ.29.40కు పెరిగింది. 2024 మేలో ఇది రూ.27.80గా ఉంది. టమాటా ధర 30%, బంగాళాదుంపలు 59%, ఉల్లిపాయల ధర 46% పెరగడం ఇందుకు నేపథ్యం.
  • రబీ పంట దిగుబడి తగ్గడంతో, ఉల్లి ధర పెరగ్గా; మార్చిలో కురిసిన అకాల వర్షాలు బంగాళాదుంపల దిగుబడిపై ప్రభావం చూపడంతో వీటి ధరా అధికమైంది. టమాటా పంటకు ప్రధాన రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌లలో వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తెగుళ్లు సోకి పంట దిగుబడి 35% తగ్గింది. బియ్యం ధర 14%, పప్పుల ధరలు 22% పెరిగాయని నివేదిక తెలిపింది.  వెజ్‌ థాలిలో ఉండేవే నాజ్‌ వెజ్‌ థాలిలోనూ ఉంటాయి. కానీ పప్పుకు బదులు కోడిమాంసం ఉంటుంది. నాన్‌ వెజ్‌ థాలి ప్లేటు సగటు ధర 2023 జూన్‌లో రూ.60.50 కాగా.. ఈసారి బ్రాయిలర్‌ చికెన్‌ ధర 14% తగ్గడంతో, ఈ ఏడాది జూన్‌లో రూ.58కు దిగివచ్చింది. ఈ ఏడాది మేలో రూ.55.90గా ఉంది.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని