cryptocurrency: క్రిప్టో కరెన్సీపై పన్నుకు మార్గం చూపిన జూదం..!

క్రిప్టో కరెన్సీలపై పన్ను వేయడానికి ప్రభుత్వానికి ఈ మధ్యే మార్గం లభించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి టి.వి.

Published : 02 Feb 2022 17:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రిప్టో కరెన్సీలపై పన్ను వేయడానికి ప్రభుత్వానికి ఈ మధ్యే మార్గం లభించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి టి.వి. సోమనాథన్‌ ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘అక్కడ ఓ అస్పష్టమైన స్థితి ఉంది. క్రిప్టోల కొనుగోలు, విక్రయాలు చట్టవిరుద్ధం కాదు. ఇప్పుడు గుర్రపు పందేలు, బెట్టింగులు, ఇతర స్పెక్యూలేషన్‌పై సంపాదన వంటి కేటగిరిలోకి క్రిప్టో ఆస్తులను తీసుకొచ్చి పన్ను విధిస్తున్నాం. క్రిప్టోలకు చట్టబద్ధత వస్తే ఏమిటన్నది తర్వాత చర్చ’’ అని వివరించారు.  

తాజా బడ్జెట్‌లో కూడా క్రిప్టోపై 1శాతం టీడీఎస్‌ విధించింది. దీంతో క్రిప్టో ట్రేడింగ్‌ ఏజెన్సీలు తప్పనిసరిగా కస్టమర్ల వివరాలను వెల్లడించి.. లావాదేవీలకు తగిన టీడీఎస్‌ను చెల్లించాల్సిన బాధ్యత వారిపై పడింది. ఈ క్రమంలో క్రిప్టో ట్రేడింగ్‌ చేసిన వినియోగదారుల వివరాలు కూడా ప్రభుత్వం వద్దకు చేరతాయి. 

చాలా ఏళ్లు మల్లగుల్లాలు పడిన తర్వాత క్రిప్టో కరెన్సీలను 2022-23 బడ్జెట్‌లో 30శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో దాని చట్టబద్ధతపై కొంత స్పష్టత లభించింది. ఇప్పటికే ప్రభుత్వం క్రిప్టోల చట్టబద్ధతపై కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతం మూడు రకాల వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులు కనిపిస్తున్నాయి. ఇందులో బిట్‌కాయిన్‌, ఎథేరియమ్‌, కార్డనో, అవలాంచీ వంటి ప్రైవేటు బిట్‌కాయిన్లు, ఎన్‌ఎఫ్‌టీ లు ప్రభుత్వాలు జారీ చేసే డిజిటల్‌ కరెన్సీలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని