Cryptocurrency: పుంజుకున్న బిట్‌కాయిన్‌.. గాడినపడ్డ ఇథేరియం!

అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్‌ నేడు తిరిగి పుంజుకుంది....

Published : 19 Apr 2022 15:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్‌ నేడు తిరిగి పుంజుకుంది. సోమవారం 38,547 డాలర్ల వద్ద ఐదు వారాల కనిష్ఠానికి పడిపోయిన కాయిన్‌ ఈరోజు 40 వేల డాలర్ల పైకి ఎగబాకింది. రెండో అతిపెద్ద క్రిప్టో అయిన ఇథేరియం సైతం పుంజుకొని 3000 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది. 

గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 4.73 శాతం పుంజుకొని మంగళవారం మధ్యాహ్నం 2:36 గంటల సమయంలో 40,741 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో ఇథేరియం 5.14 శాతం ఎగబాకి 3,042 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కొంతకాలం నేలచూపులు చూసిన బిట్‌కాయిన్‌ తిరిగి స్థిరీకరణ దిశగా సాగుతోందని ముద్రెక్స్‌ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ ఎదుల్‌ పటేల్‌ తెలిపారు. ఈ క్రిప్టోకు 37,000 డాలర్ల వద్ద మద్దతు, 45,000 డాలర్ల వద్ద నిరోధం ఉందని పేర్కొన్నారు.

గత 24 గంటల్లో ఇతర ప్రముఖ క్రిప్టోలైన ఎక్స్‌ఆర్‌పీ 3.81 శాతం, టెర్రా 17.71 శాతం, సొలానా 7.10 శాతం, అవలాంచె 7.33 శాతం, కార్డనో 5.91 శాతం, స్టెల్లార్‌ 6.90 శాతం, పొల్కాడాట్‌ 5.59 శాతం పుంజుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని