CAD: పెరిగిన కరెంట్‌ ఖాతా లోటు.. జీడీపీలో 2.8 శాతానికి!

దేశంలో కరెంట్‌ ఖాతా లోటు (CAD) పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తిలో కరెంట్‌ ఖాతా లోటు 2.8 శాతానికి (23.9 బిలియన్‌ డాలర్లు) చేరింది.

Published : 29 Sep 2022 20:25 IST

ముంబయి: దేశంలో కరెంట్‌ ఖాతా లోటు (CAD) పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తిలో కరెంట్‌ ఖాతా లోటు 2.8 శాతానికి (23.9 బిలియన్‌ డాలర్లు) చేరింది. దిగుమతులు భారీగా పెరగడంతో కరెంట్‌ ఖాతా లోటు పెరిగింది. ఈ మేరకు ఆర్‌బీఐ గురువారం డేటాను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కరెంట్‌ ఖాతా లోటు 23.9 బిలియన్‌ డాలర్లుగా నమోదైందని ఆర్‌బీఐ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కరెంట్‌ ఖాతా లోటు 13.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. జీడీపీలో దాని వాటా 1.5 శాతంగా నమోదైంది.

కరెంట్‌ ఖాతా మిగులు 6.6 బిలియన్‌ డాలర్లుగా ఉందని, జీడీపీలో దీని వాటా 0.9 శాతంగా ఉందని ఆర్‌బీఐ డేటా పేర్కొంది. గతేడాది చివరి త్రైమాసికంలో 54.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్న మర్చండైజ్‌ వాణిజ్య లోటు 68.5 బిలియన్లకు పెరిగిందని ఆర్‌బీఐ తెలిపింది. ఆదాయానికంటే చెల్లింపులు అధికంగా చెయ్యడం వల్ల కరెంట్‌ ఖాతా లోటు పెరిగిందని ఆర్‌బీఐ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని