Updated : 06 Jul 2022 14:22 IST

Online Food delivery: ఆన్‌లైన్‌ Vs ఆఫ్‌లైన్‌: ఫుడ్‌ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్‌.. పోస్ట్‌ వైరల్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీధి చివర ఉన్న రెస్టారెంట్‌ అయినా ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ (Online Food delivery) చేయడం ప్రజలకు అలవాటుగా మారిపోయింది. ఇంటికే తెచ్చివ్వడం, పైగా ఆఫర్లు కూడా ఉంటుండడంతో ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ను ఆశ్రయించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీన్నే ఆసరగా తీసుకుని ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ మనల్ని మోసం చేస్తున్నాయంటున్నాడు ముంబయికి చెందిన ఓ లింక్డిన్‌ యూజర్‌. ఆఫ్‌లైన్‌లో రెస్టారెంట్లో కొనుగోలు చేసిన ఫుడ్‌కీ, జొమాటోలో కొనుగోలు చేసిన అవే ఐటెమ్స్‌ ధరల మధ్య వ్యత్యాసం ఉందని పేర్కొంటూ ఓ పోస్ట్‌పెట్టాడు. దీంతో ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ముంబయికి చెందిన రాహుల్‌ కబ్రా ముంబయిలోని ది మోమో ఫ్యాక్టరీ అనే రెస్టారెంట్‌ నుంచి ఇటీవల జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌చేశాడు. వెజ్‌ బ్లాక్‌ పెప్పర్‌ సాస్‌, వెజిటబుల్‌ ఫ్రైడ్‌ రైస్‌, మష్రూమ్‌ మోమోను ఇంటికి తెప్పించుకున్నాడు. అందుకు అతడు డిస్కౌంట్‌ పోనూ రూ.690 చెల్లించాడు. అదే ఫుడ్‌ను అతడు ఆఫ్‌లైన్‌లో అదే రెస్టారెంట్‌కి వెళ్లి తెచ్చుకున్నప్పుడు కేవలం రూ.512 మాత్రమే అయ్యిందని గుర్తించాడు. దీనికి సంబంధించిన రెండు బిల్లులనూ లింక్డిన్‌లో పోస్ట్‌చేస్తూ తాను దాదాపు 35 శాతం అదనంగా చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వమే నిబంధనలు తీసుకురావాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.

రాహుల్‌ పోస్ట్‌ కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. దాదాపు 10 వేల లైకులు రాగా.. వందల్లో కామెంట్లు వచ్చాయి. ఇలాంటి మోసాలు జరగకుండా అరికట్టాలంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. మరో ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీలో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని మరో వ్యక్తి కామెంట్‌ చేశాడు. మరికొందరు మాత్రం రాహుల్‌ పోస్ట్‌ను వ్యతిరేకిస్తూ కూడా కామెంట్లు చేశారు. సదరు ఫుడ్‌ డెలివరీ యాప్‌కు డెలివరీ కాస్ట్‌, పెట్రోల్‌ కాస్ట్‌తో పాటు డెలివరీ బాయ్‌ సమయం వెచ్చిస్తున్నాడని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. అలాంటప్పుడు బయటికెళ్లి రెగ్యులర్‌గా తెచ్చుకుంటే సరి అంటూ కామెంటడం గమనార్హం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని