Dabur Q3 Results: డాబర్‌ లాభాల్లో 5 శాతం క్షీణత

ప్రముఖ ఎఫ్‌ఎంజీసీ (FMCG) సంస్థ డాబర్‌ ఇండియా (Dabur India) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించింది.

Published : 02 Feb 2023 18:45 IST

దిల్లీ: ప్రముఖ ఎఫ్‌ఎంజీసీ (FMCG) సంస్థ డాబర్‌ ఇండియా (Dabur India) త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి (Q3 Results) గానూ లాభాల్లో 5.51 శాతం క్షీణత నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.504.35 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించిన కంపెనీ.. ఈ సారి రూ.476.55 కోట్లు ఆర్జించినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఇక కంపెనీ ఆదాయం 3.44 శాతం పెరిగినట్లు పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆదాయం రూ.3,043.17 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,941.75 కోట్లు నమోదు చేసింది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా 5.63 శాతం పెరిగినట్లు డాబర్‌ తెలిపింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.2,523.09 కోట్లు వ్యయమైనట్టు కంపెనీ పేర్కొంది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.2,388.53 కోట్లుగా ఉంది. ఫలితాల నేపథ్యంలో గురువారం డాబర్ ఇండియా షేరు బీఎస్‌ఈలో 1.10 శాతం క్షీణించి రూ.555.45 వద్ద ముగిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని