సాంకేతికతతో రోజుకు కోటి మందికి టీకా

మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన అందరికీ కొవిడ్‌ టీకా ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఆహ్వానం పలుకుతున్నాం. దేశంలో 50,000 కేంద్రాలు ఏర్పాటు చేస్తే, సాంకేతికత వినియోగించి, క్రమబద్ధమైన విధానాలతో రోజుకు 50 లక్షల నుంచి కోటి మంది వరకు టీకా ఇవ్వొచ్చు. ఇప్పటికే సాంకేతికత సాయంతో రోజుకు

Updated : 21 Apr 2021 09:11 IST

మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన అందరికీ కొవిడ్‌ టీకా ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఆహ్వానం పలుకుతున్నాం. దేశంలో 50,000 కేంద్రాలు ఏర్పాటు చేస్తే, సాంకేతికత వినియోగించి, క్రమబద్ధమైన విధానాలతో రోజుకు 50 లక్షల నుంచి కోటి మంది వరకు టీకా ఇవ్వొచ్చు. ఇప్పటికే సాంకేతికత సాయంతో రోజుకు 20-30 లక్షల మందికి ఇచ్చేలా వ్యవస్థను తీర్చిదిద్దాం. కొద్ది నెలల కిందట నేషనల్‌ హెల్త్‌ అథారిటీ బాధ్యతలు చేపట్టిన ఆర్‌.ఎస్‌. శర్మ ఇందులో కీలక పాత్ర పోషించారు. టీకాలను భారీ స్థాయిలో ఇవ్వడానికి తొమ్మిది, 10 నెలలకు ముందే డిజిటల్‌ వసతుల మెరుగుదలపై ఒక ప్రణాళిక సిద్ధం చేశా. టీకా వేయగానే, ఆధార్‌ ఆధారంగా డిజిటల్‌ ధ్రువీకరణ పత్రం ఇస్తున్న ఏకైక దేశం మనదే.

- ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు, ఆధార్‌ సృష్టికర్త నందన్‌ నీలేకని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని