Corbevax: పిల్లలకు అందుబాటులోకి మరో టీకా.. కోర్బెవాక్స్‌కు అత్యవసర అనుమతి

దేశంలోని పిల్లలకు మరో కొవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చింది. 12-18 బయోలాజికల్‌-ఇ రూపొందించిన కోర్బోవాక్స్‌ టీకాకు డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) పరిమితులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది.

Published : 21 Feb 2022 19:24 IST

దిల్లీ: దేశంలోని పిల్లలకు మరో కొవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చింది. 12-18 బయోలాజికల్‌-ఇ రూపొందించిన కోర్బెవాక్స్‌ టీకాకు డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) పరిమితులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు ఇచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగ అనుమతులు పొందింది. దేశవ్యాప్తంగా జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి ఈ టీకా వేస్తున్నారు. అయితే, 15 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

5-18 వయసు చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి రెండో, మూడో దశ ట్రయల్స్‌ నిర్వహించేందుకు గతేడాది సెప్టెంబర్‌లో బయోలాజికల్‌-ఇ సంస్థకు అనుమతి లభించింది. ఈ క్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న రెండో, మూడో దశ ట్రయల్స్‌ మధ్యంతర ఫలితాల ఆధారంగా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినట్లు బయోలాజికల్‌-ఇ సంస్థ పేర్కొంది. కొవాగ్జిన్‌ తరహాలోనే కోర్బెవాక్స్‌ను రెండు డోసుల్లో ఈ టీకాలను ఇవ్వాల్సి ఉంటుంది. రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధి ఉంటుంది. పెద్దలకు టీకా వేసే విషయంలో దేశీయంగా తయారైన ఈ కొవిడ్‌ వ్యాక్సిన్‌కు గతేడాది డిసెంబర్‌ 28నే అత్యవసర వినియోగ అనుమతులు లభించినప్పటికీ.. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మాత్రం భాగం కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని