Delhivery IPO: ప్రారంభమైన డెలివరీ ఐపీఓ.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటారా మరి?

సరఫరా చైన్‌ కంపెనీ డెలివరీ పబ్లిక్‌ ఇష్యూ నేడు ప్రారంభమైంది....

Published : 11 May 2022 11:14 IST

ముంబయి: సరఫరా చైన్‌ కంపెనీ డెలివరీ పబ్లిక్‌ ఇష్యూ (Delhivery IPO) నేడు ప్రారంభమైంది. మే 13వరకు సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ కొనసాగనుంది. రూ.5,235 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీఓ (IPO)కి వస్తోంది. రూ.4,000 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటు రూ.1,235 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదార్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించనున్నారని వివరించింది. 

ఈ ఐపీఓకి సంబంధించిన కీలక వివరాలు..

* ధరల శ్రేణి: రూ.462-487

* కనీసం 30 షేర్లకు (ఒక లాట్‌) మదుపర్లు దరఖాస్తు చేసుకోవాలి

* షేర్ల కేటాయింపు: మే 19

* నిధుల రీఫండ్‌: మే 20

* డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ: మే 23

* మార్కెట్‌లో లిస్టింగ్‌: మే 24

ఇ-కామర్స్‌ లాజిస్టిక్స్‌ సంస్థ అయిన డెలివరీ.. దేశవ్యాప్తంగా మొత్తం 17,045 పిన్‌కోడ్‌ ప్రాంతాల్లో సేవల్ని అందిస్తోంది. ఎఫ్‌ఎంసీజీ, ఎంఎస్‌ఎంఈ, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, లైఫ్‌స్టైల్‌, రిటైల్‌, ఆటోమోటివ్‌, తయారీ.. ఇలా వివిధ రంగాల్లో మొత్తం 21,342 సంస్థలకు లాజిస్టిక్స్‌ సేవలు అందిస్తోంది. ఫిడెలిటీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చి కంపెనీ నుంచి రూ.1,995 కోట్ల పెట్టుబడులు సమీకరించినట్లు మే నెలలో డెలివరీ ప్రకటించింది. దీంతో ఈ సంస్థ విలువ 3 బిలియన్‌ డాలర్లకు చేరువయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.


నేడే వీనస్‌ పైప్స్‌ అండ్‌ ట్యూబ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ

 

వీనస్‌ పైప్స్‌ అండ్‌ ట్యూబ్స్‌ ఐపీఓ (Venus Pipes & Tubes Limited IPO) సైతం నేడు ప్రారంభమైంది. 13న ఇష్యూ ముగియనుంది. పబ్లిక్‌ ఇష్యూ (Public Issue)లో భాగంగా కంపెనీ 50.74 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఐపీఓ (IPO) ధరల శ్రేణిలో గరిష్ఠ ధర ప్రకారం.. రూ.165 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 

సమీకరణ లక్ష్యం: నిధులను సామర్థ్యాల విస్తరణ, మూలధన అవసరాలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కంపెనీ వినియోగించనుంది.

* ధరల శ్రేణి: రూ.310-326

* కనీసం 46 షేర్లకు (ఒక లాట్‌) మదుపర్లు దరఖాస్తు చేసుకోవాలి

* షేర్ల కేటాయింపు: మే 19

* రీఫండ్ల ప్రారంభం: మే 20

* డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ: మే 23

* మార్కెట్‌లో లిస్టింగ్‌: మే 24

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని